సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *కథ చదివాను. నడుస్తున్న చరిత్రను కథా రూపంలో బాగా చెప్పారు.అభినందనలు మీకు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దినకర్ రెడ్డి గారి వ్యాఖ్య: *చిత్రమైన పరిస్థితిని చక్కగా తెలియజేశారు సార్.. హింస ఎందుకో అనే ప్రశ్నకు సమాధానం లేదని గుర్తు చేశారు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. ప్రమీల గారి వ్యాఖ్య: *చదువుతున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి sir. నిజంగా ఈ అల్లర్లు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేస్తాయి. ఎవరిమీద పగను సాధించడానికి ఇవన్నీ అనిపిస్తుంది 🙏🏼*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. వి. రామిరెడ్డి గారి వ్యాఖ్య: *బాగుంది సర్. నిజంగా ఇది నడుస్తున్న చరిత్రే. కథలో జబ్బార్ అసలు నేరం చేశాడా లేదా అనే విషయం జోలికి వెళ్లకుండా, కేవలం ఆ ప్రాతిపదికపై జరుగుతున్న విచక్షణారహిత విధ్వంసాన్ని సమర్థంగా చిత్రించారు. అభినందనలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాటికోల పద్మావతి గారి స్పందన: *మీరు రాసిన ‘నడుస్తున్న చరిత్ర కథ విరోధాభాస’ మొన్న జరిగిన ఉగ్రవాద దాడులకు నిజరూపంగా ఉంది. ఎంతో మనోధైర్యంతో వాస్తవికతను వ్యక్తపరిచిన కథ కళ్ళ ముందు దృశ్యాలను కనిపిస్తున్నాయి. ఒక మంచి కథను అందించినందుకు మీకు ధన్యవాదములు. – తాటికోల పద్మావతి*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *చదివాను. పహాల్గం సంఘటన వల్ల సందర్భోచితంగా అనిపించింది. దేశ విభజన, టెర్రరిస్టులు, రాజకీయాలు అసలు సమస్యకు కారణం అని ఎంతో విజ్ఞతగా మాట్లాడినా ఖలీల్ పరిణామ క్రమం,
    మాస్ సైకాలజీ ప్రభావాన్ని నిరూపిస్తోంది. భావోద్వేగ ప్రకటన సమతుల్యంగా సాగింది. బాగుంది. 💐*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వినయ్ కుమార్ గారి స్పందన: *🌹🙏🏻🌹 చాలా చక్కగా వ్రాసారండి. ‘ఆందోళన జీవుల’ వర్ణన అద్భుతం. ఎంత జరిగినా చాలామంది హేతు లౌకిక మోడరన్ వాదులకు ఈ సంఘటనలు వాస్తవాలు కావు. పొడుపు కథలు. తమ తెలివితో విప్పుతారు – “ఉన్మాదం ఎక్కడైనా ఉన్మాదమే హిందూ ముస్లిం ఉండదు/టెర్రరిస్టు లు ఏ మతం లో ఉన్నా టెర్రరిస్టు లే/హిందువులు కూ ఉంది మతం మత్తు” ఇత్యాది.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *ఇలాంటి సెన్సిటివ్ విషయం మీద కథ వచ్చినప్పుడు రచయిత ఎటువైపు నిలబడ్డాడు అని పాఠకులు, విమర్శకులు ఆసక్తిగా గమనిస్తారు. ఇక్కడ రచయిత ఎటూ తొణకకుండా జరుగుతున్న సంఘటనలను పాఠకుల ఎదుట ఉంచి, తర్వాత వారి వారి ఆలోచనలకు వదిలివేయడం చాలా హుందాగా ఉంది. విభిన్న మతాల వారు కలిసిమెలిసి ఒకే కుటుంబంగా దగ్గరైన వారు హఠాత్తుగా దూరమై పోవడం, కనిపించని గోడలు ఏర్పడడానికి కారణాలు ఏమిటో ప్రజలు గ్రహించాలి – పార్టీలు, ప్రభుత్వాలు కాదు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అయినవోలు ఉషా దేవి గారి స్పందన: *నడుస్తున్న చరిత్ర కథ ఇప్పుడే చదివాను. చాలా కలిచి వేసే కథా, కథనం రెండూ. పూర్తిగా అద్దం పట్టి చూపినట్లు రాశారు. కళ్ళముందు జరుగుతుంటే అక్కడ మేమూ నిస్సహాయ సాక్షీభూతులుగా ఉన్నామని అనిపించింది. ఊపిరి స్తంభించినట్లు అయింది. 🙏 అయినవోలు ఉషా దేవి.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీనివాస ప్రసాద్ గారి స్పందన: కథ చాలా చాలా బాగుందండి.. ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కథ ముగింపు సమయంలో చదువుతుండగా మనసు బరువెక్కిపోయింది. శ్రీవర రాజ తరంగిణిలో ఒకచోట మీరే అంటారు తీవ్రవాదులు ముస్లింలు కావచ్చు, కానీ ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు అని.. కథ ప్రారంభంలో ముగింపు అదేవిధంగా ఉంటుందని నేను భావించాను. ధన్యవాదాలు 🙏 🙏 Srinivasa prasad.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి స్పందన: *ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ రావడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా ఉంది. కథలో వాస్తవిక పరిస్థితులను కళ్ళకు కట్టారు. అభినందనలు. 💐👏🏻*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అక్కపెద్ది వేంకటేశ్వర శర్మ గారి స్పందన: *దేశమంతా యుధ్ధమేఘాలు కమ్ముకుంటున్నవేళ ‘నడుస్తున్న చరిత్ర కథ’ వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టినట్టుగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాల స్వార్థపరమైన ఆలోచనలవల్ల మొత్తం సమాజమే రెండు ముక్కలుగా విడిపోతోంది. అభద్రతాభావం, ఆందోళనల వల్ల చివరికి మనిషిని మనిషే నమ్మలేని దారుణమైన పరిస్ధితులు చోటుచేసుకుంటున్నయ్.
    “నేను ప్రాణాలతో బయటపడితే..” అనే ముగింపు ఈ కథని చదివిన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది.
    ‘రావణకాష్టాన్ని’ రగిలించిన వాళ్ళు సన్నాయినొక్కులు నొక్కుతూ బాగానే ఉన్నారు. భగభగమండే అగ్నిజ్వాలల్లో సమిధల్లాగా బలి అవుతోందిమాత్రం సామాన్యులే. “మనిషి చచ్చి పీనుగులా మారాక, ఆ శవాన్ని ‘కాలిస్తే’ ఏంటి? పూడిస్తే ఏంటి?”, “ఇవాళ పోతే రేపటికి రెండు..” అనే స్పృహ లేని బ్రతుకులెందుకు? మారణహోమాన్ని సృష్టించి, ఆ మంటల్లో చలికాచుకునే మతరాజకీయాలని గుర్తించని మనుషులెందుకు?.. అభినందనలతో. – అక్కపెద్ది.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నరేంద్ర సందినేని గారి వ్యాఖ్య: *ఈ దేశంలో హిందువులకు భద్రత లేదు. చక్కటి ముగింపు. కథ అద్భుతంగా ఉంది. మీరు గొప్ప కథ రాసారు.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This a comment by Gayathri garu: *Namaste andi🙏🏽
    Thank you so much for sending this story.
    A thought provoking story with a very sensitive subject at the current juncture of Indian history.
    It also is a universal subject of the tragedy/ tragic comedy of human mind and its limited perspectives and passions and paradoxes.
    The problem of the minority sections of human society has been similar throughout history all over the world.
    It keeps going like a pendulum between the oppressed and the oppressors.
    It makes us wonder about human nature and psychology; about the roots of the problem.
    The way you wove so many threads of human reality into a compact tapestry is admirable.
    The characters of Khalil and the narrator, are showing us the innate goodness of human nature and the limitation..
    Gayathri

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!