Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విందు భోజనం

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘విందు భోజనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

విందు భోజనం
పసందు భోజనం
తినుడు తక్కువైంది
పారేసుడు ఎక్కువైంది

చిత్రమైన జనం
విచిత్రమైన వైనం
ఏమిటో వింత చోద్యం
చెత్తకుండికి నైవేద్యం

ఖరీదైన వంటకాలు
కాకూడదు పెంటపాలు
ఆతిథ్యాన్ని గౌరవించు
ఆనందంగా భుజించు

వంట కోసం భరించే
తిప్పల్ని గుర్తించు
పంటకోసం శ్రమించే
బాధల్ని గమనించు

అన్నం అంటే
పరబ్రహ్మ స్వరూపం
అన్నం లేకుంటే
ఆరిపోతుంది ప్రాణ దీపం

Exit mobile version