సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    మంచి చురకలండీ! వారు మారరు… అభినందనలు…

    Reply
  2. 2

    Ramani

    Lessa palikithiri😀

    Reply
  3. 3

    GOKO

    Looks like this is written in frustration and with broad generalizations. There is truth in what is presented but the article is devoid of any specific examples. In general, there are dwindling numbers of readers, for whatever reason. Visual media is dominating the print media.
    Other accusatory statements about authors from India and NRI authors is nonsense and is in bad taste.

    Reply
  4. 4

    sarat babu

    sarat

    సాహిత్య హింసపై
    కృష్ణ
    సుదర్శన ప్రయోగం

    Reply
  5. 5

    Vasanth

    ఏమి చెప్పితిరి ఏమి చెప్పితిరి….అందుకేనేమో ఇంట గెలవలేక పోతోంది తెలుగు తల్లి

    Reply
  6. 6

    లక్ష్మణ చక్రవర్తి

    1. అధ్యాపక, ఉపాధ్యాయ విమర్శకులు. బదులు బోధక విమర్శకులు అంటే బాగుండేది.
    అకడమీషియన్స్ లో అకడమిక్ విమర్శ లో ఇటీవల వచ్చిన ఒక లక్షణం కెరీరిస్టు స్వభావం, తానే మొదటగా చెబుతున్నడని. బిల్డప్ ఇవ్వడం.
    దీనిని రెండు రకాలుగా చూడవచ్చు.

    జర్నలిస్టు రచయితల లాగే. జర్నలిస్టు విమర్శకులు ఉన్నారు.
    రచయితలు 6 రకాలైతే విమర్శకులు. 9.
    రకాలు ఆశ్చర్యం ఆనందం.
    బ్రహ్మ సృష్టి కర్త విష్ణువు స్థితి కర్త ద్వారా కవి , విమర్శకులను. చెప్పడం బాగానే ఉంది కానీ విష్ణు పుత్రుడు బ్రహ్మ కదా😊
    [రచయితలను విమర్శకులను సృష్టిస్తున్నారంటారా?
    శీర్షిక మీ style లో ఉంది. నేనైతే ‘నవ’ వందిమాగధులు అని పెట్టే వాడిని.

    Reply
  7. 7

    సాదనాల

    శుభోదయం. ఎవరూ మిగలలేదు కదా. ఎవరైనా ఏదో ఒక వర్గంలో ఉన్నవారే!😢👌

    Reply
  8. 8

    కస్తూరి మురళీ కృష్ణ

    From writer r v rasani
    మురళిగారూ
    మీరు పంపిన విమర్శకులగురించిన వ్యాసం చాలాబాగుంది.ఆలోచనాత్మకంగాను సదరు విమర్శకుల గూబగుయ్యమనేటిగానువుంది.ఈవ్యాసాన్ని చాలామందికిపంపాను.థ్యాంక్స్

    Reply
  9. 9

    కస్తూరి మురళీ కృష్ణ

    From Jwalitha Denchanala
    విమర్శల పై విమర్శ
    అక్షర సత్యాలు రాశారు అభినందనలు

    Reply
  10. 10

    కస్తూరి మురళీ కృష్ణ

    From Bhujanga Rao
    Very good article. Selected for University syllabus is very much appreciated. Now a days all cultural organisations doing the same. Real and worthy writers are not getting any moral support or no minimum appreciation for their literary service.

    Reply
    1. 10.1

      Sambasiva Rao Thota

      మురళీకృష్ణ గారూ !
      మీ రచన నన్నెంతో ఆలోచింపచేసింది !!
      నిజాలు నిష్టూరంగా అనిపించినా యదార్ధాలను కళ్ళ ముందు ఆవిష్కరించారు !!!
      మీకు ధన్యవాదాలు !!!🙏🙏🙏

      Reply
  11. 11

    కస్తూరి మురళీ కృష్ణ

    From Gopala krishna
    I do not agree with the assessments you presented. That is my personal opinion. thank you

    Reply
  12. 12

    Vaddi Vijaya sarathi

    సామాజిక స్పృహ అని ఒకచోటవ్రాశారు. ఏఅర్థంలో వ్రాశారో నాకు తెలియలేదు. సోషలిస్టు సామాజిక స్పృహనే కుదించి ఇలా వ్రాస్తారని, అటువంటి అర్థంలోనే ఆ పదాన్ని ప్రయోగించాలనీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఒక సభలో శాసించారు. అంటే(బూర్జువా -ప్రొలిటేరియట్) వర్గ స్పృహ రచయితకు ఉండవలసిన ఒక మౌలిక లక్షణమని ఆయన చెప్పినట్లుగా ఆనాటి శ్రోతలకు తోచింది. అందరూ ఆయనగారి అభిప్రాయం(వాదం)తో ఏకీభవిస్తారని నేను అనుకోను. కాగా ప్రమాణాలను ఏర్పరుచు కోవటంలో కాలం చెల్లిన ఇజాలు ఏవిధంగా ప్రాముఖ్యం వహిస్తున్నవో నలుగురి దృష్టికి తీసుకొన రాదలచి ఈ ప్రస్తావన చేశాను.

    Reply
  13. 13

    మంజుల

    ఏ బలం,బలగం లేని ఎందరో రచయిత ల ప్రాతినిధ్యం వహించి జరుగుతున్న వాస్తవానికి అక్షర రూపం ఇచ్చారు..

    మంజుల

    Reply
  14. 14

    కస్తూరి మురళీ కృష్ణ

    From Kondapalli Noharini
    మురళీకృష్ణా ‘సాహిత్య విమర్శ’ ప్రస్తుత తీరును ఇంత ఖచ్చితంగా , ఇంతసూటిగా ఎట్లరాయగలిగావు? గాంధారి ఉపమానమూ ఎత్తుకున్నావు ? భట్రాజుులనూ వదల్లేదు ! బావుంది.

    Reply
  15. 15

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    అసలు సాహిత్యప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఏమై ఉండాలో చెబుతూ…పూర్తి సాహిత్యప్రపంచాన్ని వర్గాలలో బంధించేసారు…విమర్శ చురకలా ఉంటుందనే దానికి మీ రచనను ఉదహరించవచ్చు…బహుశా చాలా మంది భుజాలు తడుముకుంటారు సర్

    Reply
  16. 16

    కస్తూరి మురళీ కృష్ణ

    From Seela Subhadra Devi
    దుమ్ము దులిపినట్లు గొప్ప ధైర్యంగా ఉతికి ఆరేసారు మురళీకృష్ణ గారు.కష్టంగా అనిపించవచ్చు కానీ నిజమే.సాహిత్యరంగం గ్రూపులుగా విడిపోయింది.ఎవరిగ్రూపులోవారిని వాళ్ళే పొగుడుకుంటూ పైకి ఎత్తుతారు దీనికి కులం,మతం,ప్రాంతీయాలు కూడా ఒక ప్రాతిపదికనే.కులం,హోదా,అధికారం,శిష్యప్రశిష్యగణం ఉంటే ఎంత ఎత్తు కైనా ఎదిగిపోవచ్చు. ఏదో మనమట్టుకు మనం రాసుకుందామంటే గుర్తించే వాళ్ళు ఉండరు.అందుకే గాడ్ ఫాదర్ ల చుట్టూ చేరి తాతాచారి ముద్ర వేయించుకునే ప్రచారపటాటోపం తో ఒక్క పుస్తకం తోనే మహా రచయితలు, కవులు అయిపోతున్నారు.

    Reply
  17. 17

    alluri gouri lakshmi

    మురళీకృష్ణ గారు “సాహితీ సమాజ-వాస్తవచిత్ర సమ్మోహనాస్త్రం” వేశారు. అంతా మూర్ఛపోయారు వివిధ కారణాలతో..(గుచ్చుకోగా నొచ్చుకొని బాధతో కొందరూ..ఇన్నేళ్ళుగా నొచ్చుకున్నవారు మెచ్చుకుంటూ ఆనందంతో వారూ etc.)

    Reply
  18. 18

    Jhansi koppisetty

    వందిమాగధ భజన బృందాలపై పఠనీయమైన very educative article. ఒక ప్రసిద్ధ విశ్వ విద్యాలయంవారు విద్యార్థులుకు పాఠ్యాంశంగా ఎంచుకోవటంలోనే ఈ వ్యాసం విశిష్టత తెలుస్తోంది. విమర్శకులను వివరణాత్మకంగా వర్గీకరిస్తూనే రచయితల లక్షణాలను వైవిధ్యాలను వివరించారు. సాహిత్య విమర్శకులు రచయితలు అనుకుంటున్న ప్రతిఒక్కరూ చదవాల్సిన వ్యాసం👌👌👌

    Reply
  19. 19

    బెహరా వెంకట లక్ష్మి నారాయణ

    భలే..కర్రు కాల్చి వాతలు పెట్టారు..పచ్చి నిజాలు

    Reply
  20. 20

    రామలక్ష్మి

    చాలా బాగా విశ్లేషించారు సర్.

    Reply
  21. 21

    Sannihith

    Super sir..True..

    Reply
  22. 22

    రాధికాప్రసాద్

    ఎంతో ఉపయోగకరమైన వ్యాసం.. విమర్శకులు ఎలా ఉండాలో మంచి దిశానిర్దేశం చేశారు.. ఇదే మంచి విమర్శలు చేసినప్పుడు, రచయిత విమర్శలను సానుకూలంగా తీసుకోకుండా, వ్యక్తిగత దూషణలకు దిగితే సదరు విమర్శకుడు ఎలా స్పందించాలి.. తెలియచేయగలరు.. 🙏🏻

    Reply
  23. 23

    CSRambabu

    ప్రస్తుతం తెలుగుసాహిత్యం గ్రూపులుగా విడిపోయిందనిపిస్తుంది
    ఎవరి వర్గం వారిది..ఎవరి భోజనం బృందాలు వారివి…
    మీరు ప్రత్యేకించి పేర్కొనకపోయినా
    గతవారం వివిధ లి వచ్చిన వ్యాసం trigger చేసినట్టుంది
    ఒకటి మాత్రం నిజం
    ఇప్పుడు విమర్శ లేదు
    ఉంటే పొగడ్తా
    లేకపోతో గోడమీద పిల్లి వ్యవహారం…
    సినిమా రంగంలో నెపోటిజం
    ఇక్కడ ఆశ్రిత వర్గం…

    సి.యస్.రాంబాబు

    Reply
  24. 24

    vidadala sambasivarao

    చాలామంది సాహితీ వేత్తల అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న ఆవేదనను మీరు ఆవిష్కరించారు…అభినందనలు
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  25. 25

    కస్తూరి మురళీ కృష్ణ

    From Gangishetty Lakshmi Narayana
    నేను రచయితను కాను.
    కాలేను అని పూర్తిగా గ్రహించాక,
    అక్షర ప్రపంచంలో కాస్త చోటు దక్కించుకోవాలంటే
    విమర్శకుణ్ణి కావడమే గత్యంతరం అని గ్రహించాను… మురళీ కృష్ణ గారే అన్నట్లు, విమర్శకుడికీ- ఉపాధ్యాయుడికీ విభజన రేఖ చెదిరిపోయి, లక్ష్మణ్ చక్రవర్తి మాట-‘బోధక విమర్శకుడు’- ఒకడు ఏర్పడ్డాడు కనుక, సహజంగా, ‘అలా’ విమర్శకుడిగా ఒక మూడు దశాబ్దాల క్రితం కూస్తా పేరు తెచ్చుకొన్నాను… పోనీ, అలా భ్రమించాను…

    ఇప్పుడు మీ వ్యాసం చదివాక ‘ నేను ఈ నవవిధ విమర్శకుల్లో ఎవడిని’ అని నిజాయితీగా నన్ను నేను ప్రశ్నించుకొన్నాను…

    తేలిన సమాధానం ఏమిటంటే, ఉన్నది ఒకటే సత్తు, చదువుసత్తువ ఉన్నవాళ్లు రకరకాలుగా చెబుతుంటారు, అని!
    ‘ ఏకో నవవిధ విమర్శకః, విప్రాః బహుధా వదంతి’ . నవ సంఖ్య సంపూర్ణతకు గుర్తు కాబట్టి ‘అహమేవ సంపూర్ణ విమర్శకః’…. అంతిమ సత్యాన్ని గుర్తించక, ఇంత తెలుగింటిని పీకి పందిరి వేస్తారా???

    78లో ఒకరోజు శ్రీ తిరుమల రామచంద్ర గారితో పాటు, బర్కత్పురా లోని ఓ సందు గుండా వెళ్తున్నాను… అప్పట్లో ఆయన క్రమం తప్పకుండా, ఆంధ్రపత్రిక (వారపత్రిక) లో ‘హైదరాబాద్ నోట్ బుక్’ రాస్తుండేవారు… రచనలు, సాంస్కృతిక విషయాల మీద చక్కటి పరామర్శ, పరిచయం ఉండేవి… సామాన్యంగా వారిది ఎదుటి వారి లోని గుణాన్ని (మాత్రమే) ఎత్తి చూపే స్వభావం….
    నేను ఉండబట్టలేక అనేశాను: “మీరు ప్రతివాణ్ణి, ప్రతి చెత్తనూ పొగిడేయడం అసలు బాగాలేదు”అని.
    “అలా, పొగిడినందుకైనా ఇప్పుడు కాకపోతే , రేపైనా కొంత బాగా రాయటానికి ప్రయత్నం చేస్తారు కదా!” అన్నారు, ఆయన తాపీగా!
    ఆ తర్వాత ఒక వారం నోట్ బుక్ లో మొత్తం నా ‘శ్రీవేమన’ నాటకం గూర్చే రాశారు. నేను థాంక్స్ చెప్పలేదు. ఆయన ‘ఆ దృష్టి తోనే రాశారేమో’ నని లోన దిగులు..
    అంతకుముందు సంవత్సరం, 77 లో, విశ్వనాథ గారి గూర్చి ముమ్మరంగా చర్చ జరుగుతున్నప్పుడు, కొత్తగా ఏర్పడ్డ విశ్వనాథ పీఠానికి మా అంతర్జాతీయ తెలుగు సంస్థే కార్యాలయంగా ఉన్నప్పుడు, విశ్వనాథ వారిపట్ల, కొంత వ్యతిరేకభావం వ్యక్తమయ్యేలాగానే, నేనూ ఒక వ్యాసం రాశాను… అప్పట్లో చే.రా.గారితో మంచి దగ్గరితనం ఉండేది. ‘తెలుగుదేశం’ ఆలోచనే లేని రోజులవి.. వ్యాసం చదివి వారన్నారు, “నువ్వు ఉద్యోగంలో రెగ్యులరైజ్ అయ్యేదాకా ఈ వ్యాసం ప్రచురించొద్దు” అని..
    చూశారా, ఈత కష్టాలు ఈతవి, పీత కష్టాలు పీతవి… విమర్శకుడి బాధలు విమర్శకుడివి, *జర్నలిస్టిక్ విమర్శకుల బాధలు జ.వి.లవి* (ఇది అవశ్యం మీరు పరిశీలించదగ్గ కొత్త వర్గం… ఇప్పుడు బోధక విమర్శకులైనా, బాధక విమర్శకులైనా, బాదుడు విమర్శకులైనా, జ.వి. లైతేనే విమర్శకులుగా లెక్కింపు!!)

    పాపం, ఇస్మాయిల్ గారు ఒక ఇంటర్వ్యూలో గట్టిగా నిలదీశారు…. “తమ రచనల గూర్చి సమీక్షించక పోతే ఈ విశ్వవిద్యాలయం తెలుగు చెవులకు ఏమర్ధం?”అని. ఆయనకే కాదు, మీ విషయం తెలియదు కానీ, చాలామంది దృష్టిలో, విమర్శకుడనే వాడు రచయిత ప్రోడక్టుకు మార్కెటింగ్ ఏజెంట్ అని…! పత్రికలో ఆ మార్కట్టింగ్ పని చేసేవాడే విమర్శకుడని!! విమర్శ అనేమాటే అంతగా అబ్యూజ్ పాలయింది. *విమర్శ అంటే సాహిత్య శాస్త్రం , సాహిత్య అధ్యయనానికి సంబంధించిన సమగ్రమైన మెథడాలజీ అనే అవగాహనే పూర్తిగా లుప్తమై పోయింది.*
    ఆమాట బదులు వివేచన అనే మాటను, కనీసం అధ్యయన క్షేత్రంలో, వాడుకలోకి తెద్దామంటే అసాధ్యమై పోయింది…

    ఇంతకీ మీ వ్యాసంలోని కొంతభాగాన్ని దూరవిద్యా విద్యార్థులకు పాఠ్యభాగంగా ఎంచుకున్న సదరు పేరుగన్న విశ్వవిద్యాలయ ఆంధ్రా ధిపుల్నో, సంపాదకుల్నో వారి నిర్భీకతకు శ్లాఘిస్తున్నాను..
    వాక్యాలలో ఏ ఎడిటింగూ లేకుండా ఎంచుకొని ఉంటే, ఆ విద్యార్థుల ఖర్మను ముందుగా సమాశ్వాసిస్తున్నాను…

    Reply
  26. 26

    కోవెల సంతోష్ కుమార్

    బాలీవుడ్ సినిమా.. తెలుగు సాహిత్య రంగాలను సరదాగా పోల్చుకొని చూస్తే.. బాలీవుడ్లో కంగనా రనౌత్.. తెలుగు సాహిత్యంలో కస్తూరి వారిని చెప్పుకోవచ్చేమో.. మురళిగారూ.. ఇది సరదాగా అంటున్నదే..
    తెలుగు సాహిత్యంలో సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకొనే కొందరు కుహనా విమర్శకులను దృష్టిలో ఉంచుకొని చేసిన విశ్లేషణే ఈ వ్యాసమిది. అంతేతప్ప తెలుగు సాహిత్యంలో విమర్శను ఒక ప్రక్రియగా చేసుకొని దాన్ని సమర్థంగా నిర్వహించిన మహానుభావులను ఉద్దేశించింది కాదు. ఇవాల్టి సాహిత్యాన్ని.. విమర్శ తీరును.. చాలాకాలంగా గమనిస్తున్న నాకు ఇలాంటి విమర్శకుల రచనలు సుపరిచితమే. ఒకప్పుడు రచనలను పత్రికాఫీసులకు పంపిస్తే.. సంపాదకుల వారు.. ఆ రచనలను వాటి స్థాయిని బట్టి ఆయా విమర్శకులకు పంపించి దానిపై సమీక్ష చేయించేవారు. ఇప్పుడు పుస్తకాల కంటే ముందు నేరుగా ముందస్తు సమీక్షలే వస్తున్నాయి. రచయితను పొగడటమే తప్ప అందులోని వస్తువును విశ్లేషించడమన్నది జరగడమే లేదు. కొన్ని సందర్భాల్లో రచయితే విమర్శకుడై.. తన రచనను తానే సమీక్షించుకొని తానే వ్యాసం రాసుకొని ప్రచురణకు పంపడమూ జరుగుతున్నది. లేదా తాను రాసిన వ్యాసాన్ని వేరేవారి పేర్లతో అక్కడక్కడా కొండొకచో మార్చి మార్చి వేర్వేరు పత్రికలకు పంపుతున్నారన్నది నిష్ఠుర సత్యం. రచయితలకు ఫిక్స్ డ్ పాఠకులు, ఫిక్స్ డ్ విమర్శకులు తయారైన రోజులివి. ఇక సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్లు, పొగడ్తలే.. సాహిత్య విమర్శగా మారిపోయిన దౌర్భాగ్యం మరొకటి. అంతకు మించి.. ఎప్పుడో చిన్నప్పుడు స్వయంగా చదివినవో.. లేకపోతే.. ఆ చదువు కూడా లేకుండా.. ఎవరో చెప్పిన జ్నానాన్ని మెదడులోకి చొప్పించుకొని రచన ఏదైనా.. విమర్శ ఏది చేసినా.. తనకున్న సదరు జ్నానాన్నే మహాజ్నానంగా భావించి తాను చేసే ప్రతి విమర్శకు అలియాస్ సమీక్షకు ’ఆవు వ్యాసం‘ మాదిరి ఆపాదించేవారు మరికొందరు.

    Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మురళీ కృష్ణ గారూ
    ఒక మంచి వ్యాసం రాసి పుణ్యం కట్టుకున్నారు.
    పైగా కేటగిరీలు విభజించి రచయితలను,విమర్శకులను చక్కగా వేరు చేసి చెప్పారు.ఈ పొగడ్తల పర్వం భవిష్యత్తు లో మరింత విజృంభించే అవకాశా లు లేక పోలేదు.
    అయితే మీ చురకలు తాకే సున్నిత చర్మం గల సాహితీ పెద్దలు వున్నారా అన్నది ప్రశ్న! మీ వ్యాసమూ,గంగిశెట్టి గారి కామెంటూ కలిపితే
    నాటి_నేటి సమీక్షకుల గందరగోళం సామాన్య పాటకుడికి సైతం అవగాహన అయిపోతుంది.ఉన్నత ప్రమాణా లతో కూడిన విమర్శ/సమీక్షలు,ఆశిస్తున్న వాళ్లలో నేనూ ఒకడిని.ఆ..రోజు కోసం ఎదురు చూడవలసిన్డె.
    మీకు కృ త జ్ఞ తలు/శుభా కాంక్షలు.

    ___డా కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ _506004

    Reply
  28. 28

    కస్తూరి మురళీ కృష్ణ

    From Shiramshetty Kantha Rao
    వ్యాసంలోని ప్రతి అక్షరం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సత్యం సర్!
    కస్తూరి వారి వ్యాసం నిజంగా వాస్తవ పరిమళాలు వెదజల్లుతుంది సర్!
    ధన్యవాదాలు.

    Reply
  29. 29

    భమిడిపాటి ఫణిబాబు

    100% అక్షర సత్యాలు..

    Reply
  30. 30

    కోడే యామినీ దేవి

    ఒకమాట లో చెప్పాలంటే వాస్తవం సర్.. అంతే.
    జరుగుతున్న పరిణామాలను కళ్ళముందు పెట్టారు.
    బావుందనడం అతి చిన్నమాట.
    చాలా చాలా నచ్చిందండీ.
    (సూటిగా గుచ్చారంతే. . గుమ్మడికాయని బుజాలమీద వెతుక్కుంటూ ఉంటారనేకులిప్పుడు.. )👌👌

    Reply
  31. 31

    Sudha Rani

    నా మనసులో ఉన్న సందేహాలకు సమాధానం దొరికింది మీ వ్యాసం ద్వారా.నిజంగానే సాహిత్యంలో భజన గ్రూపులు ఏర్పడ్డాయి. తదనుగుణంగా పేరు రావడం, వారి రచనలు ఆకాశానికి ఎత్తేయడం జరుగుతోంది. మాలాంటి నూతన రచయితలు ఏదో కొత్తగా వ్రాద్దాం అనో, ప్రస్తుత పరిస్థితులను నలుగురి దృష్టికి తీసుకు రావడమో చేద్దామనుకుంటే అడ్రెస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.నిజాయితీ కలిగిన రచయితల అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు మురళీ గారు🙏🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!