[కరణం లక్ష్మీ శైలజ గారు రచించిన ‘విలువైన విద్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
దోచుకోలేనిది మన విద్యాసంపద
మనదే హక్కు మనవిద్య పట్ల
ఇష్టంగా చదవాలి ఉన్నత విద్యను
కష్టపడైనా అధిరోహించాలి విద్యా సింహాసనాన్ని
గడించవచ్చు విద్యా దానం వల్ల కీర్తిని
పొందవచ్చు సంఘంలో గౌరవాన్ని
విద్యయే మన ఉన్నతికి ఆలంబన
విద్యయే మెండైన సాధనం మన అభివృద్ధికి
కోల్పోతాము విచక్షణ విద్య లేనందున
నిజమైన సంపద జ్ఞాన సంపదయే
పడనేల ఎగ్గు జ్ఞాన సంపదకు
తరిగిపోని దానమే విద్యాదానం
విద్యకొరకు మనమందించే సహకారం
వెలకట్టలేని మహోన్నతమైన చేయూత
పదుగురికి పంచినా తరిగిపోదు విద్యాసంపద
పైగా పెరిగిపోవునప్పుడే విద్య విలువ