[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. శ్రీ బిజినపల్లి లక్ష్మీ వేంకటేశ శతకము:
ఆచార్య కసిరెడ్డి ఆనందగిరిపై వెలసిన బిజినపల్లి లక్ష్మీ వేంకటేశుడికి అంకితమిస్తూ ‘బిజినపల్లి లక్ష్మీ వేంకటేశ’ మకుటంతో రచించిన శతకం శ్రీ బిజినపల్లి లక్ష్మీ వేంకటేశ శతకం.
సరళమైన పదాలతో లోతైన భక్తి భావనలను ప్రదర్శిస్తుందీ శతకము.
~
రాజ్యధ్వఝము కలదు రాష్ట్రీయ ధ్వజముంది
రాజ్యధ్వజము శ్రీ తిరంగ జెండ
రాష్ట్ర ధ్వజము సుమ్ము కాషాయమది నమ్ము
బిజినపల్లి లక్ష్మీ వేంకటేశ
~
అక్షరమ్ము నమ్ము అభ్యదయమ్మగు
అక్షరమ్ము నిత్యశిక్షణమ్ము
అక్షరమ్ము నిజము ఆనంద నిలయమ్ము
బిజినపల్లి లక్ష్మీ వేంకటేశ
***
ఆచార్య కసిరెడ్డి
పేజీలు: 32
వెల: అమూల్యము
ప్రతులకు:
ఆనందగిరి గోదాసమేత లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం
బిజినపల్లి
నాగర్ కర్నూలు జిల్లా
2. శివకేశవార్చనము:
శ్రీమతి చావలి బాల కృష్ణవేణి రచించిన శివస్తుతి, కృష్ట ద్విశతుల పుస్తకం ‘శివకేశమార్జనము’. ప్రజల బాధలను బాపమన్న అభ్యర్ధన శివశకతంలో కనిపిస్తే, కృష్ణ లీలలను భక్తి భావంతో ప్రదర్శించటం కృష్ణ శతకంలో కనిపిస్తుంది.
~
శివ శతకం:
భక్త జనుల నానందమే బాష్పధార
లనెడు నీటిని లింగము పైన రాల్చి
భక్తి పరవశమందగా పలుకవేల!
ఈశుడుగ గాచుమిల్లిల్లు నశి గూడి
~
శివుడవు, సదాశివుడవు విశేషమైన
శక్తి రూపడవు, గిరజశక్తి నుండి
చిత్త చాంచల్య మంతయు జేల్చదొరవు
ఈశుడుగ గాచుమిల్లిల్లు నశిగూడి
కృష్ణ శతకము:
హరినామమె తీయదనము
గిరి రాజవరదుని జూగడ కాలము సుంత
పరితాపము జీల్చి ఘనము
మరణాంతక ధుఃఖ నాశి! మహిమది! కృష్ణా!
~
శ్రీకృష్ణాయను నామమె
నేకృత పాపపు వినాశి యే జన్మకునున్
స్వీకృతమౌ మన మందిర
మీ కృపకును కారణంబు మీదుగ కృష్ణా!!
***
శ్రీమతి చావలి బాల కృష్ణవేణి
పేజీలు: 40
వెల: ₹ 60/-
ప్రతులకు:
ఇంటి నెంబరు 1-4-2-78
రోడ్ నం. 6, (ఓల్డ్ రోడ్ నెం. 10)
న్యూ మారుతీ నగరి (ఈస్ట్)
కొత్తపేట, హైదరాబాద్-35
ఫోన్: 8341353323
3. శ్రీ శ్రీనివాస శ్రీ కృష్ణ శతకద్వయం:
శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి – కృష్ణ అనే మకుటుంతో శ్రీకృష్ణ శతకము, ‘శేషగిరి వాస తిరుమల శ్రీనివాస’ అనే ఏక పాద మకుటంతో శ్రీనివాస శతకము రచించారు. ఆ రెండు శతకాలను అందిస్తుంది ‘శ్రీ శ్రీనివాస, శ్రీ కృష్ణ శతకద్వయం’ పుస్తకం.
శ్రీ శ్రీనివాస శతకము:
క్షరుడు జీవుడు బ్రహ్మమక్షరుడనబడు
పాపకర్మల దుర్గతి పాలబడును
పుణ్య కర్మల సద్గతి పొందురనని
శేషగిరి వాస తిరుమల శ్రీనివాస
~
కలియుగమంబున మనుజుల కల్మషముల
పోవు మార్గము తెలిసిన పుణ్య చరిత
జగమునేలెడి యాచార్య శరణు శరణు
శేషగిరి వాస తిరుమల శ్రీనినవాస
శ్రీ కృష్ణ శతకము:
పరమాత్మవు నీవంచును
మరచిన బ్రహ్మకును నీదు మహిమను జూపన్
పరుగున వచ్చెను తానే
సరగున పదమంటి నిన్ను శరణనె కృష్ణా!
~
నిను భజియించెడి వారల
కనురెప్పగ కాచుదువట కలిలో స్వామీ!
నిను కొలచిన సిరులిత్తువు
నిను నమ్మిన భవహారమగు నిరతము కృష్ణా!
***
శ్రీమతి బంధకవి సుబ్బలక్ష్మి
పేజీలు: 58
వెల: ₹ 60/-
ప్రతులకు:
77, రోడ్డు నెం. 10,
ఆర్.ఎన్. రెడ్డి నగర్
మీర్‌పేట్, హైదరాబాద్-9
ఫోన్: 7075359370

