[‘అనంతచ్ఛందం ప్రచురణలు’ వారు ప్రచురించిన కొన్ని శతకాలను పరిచయం చేస్తున్నాము.]
‘అనంతచ్ఛందం ప్రచురణలు’ ఒక ఉద్యమంలా పద్య కవిత్వాన్ని, ముఖ్యంగా శతకాలను ప్రచురిస్తున్నది. వందకు పైగా ఉన్న వీరి ప్రచురణలలో పద్య రచన అత్యుత్తమ స్థాయిలో కనిపిస్తుంది. ఔత్యాహిక పద్య రచయితనలను చెయ్యి తిరిగిన పద్య రచయితలు చేయి పట్టి మార్గదర్శనం చేస్తూ, వారి పద్య రచన నైపుణ్యాన్ని ఇనుమడింప చేయటం ఈ శతక పద్యాల పుస్తకాలలో తెలుస్తుంది. తెలుగు సాహిత్యంలో పద్య రచన పునరుజ్జీవనానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ తెలుగు భాష అందమైన సంతకం అయిన పద్యాన్ని తిరిగి ప్రధాన వేదికపై నిలపాలని వీరు చేస్తున్న ప్రయత్నానికి – పద్యాన్ని కవికి సిసలైన గుర్తింపుగా భావించే సంచిక ఇచ్చే చిరు ప్రోత్సాహం, అభినందనలు ఈ చిరు పరిచయాలు.
***
1. శతక యుగళమాధురి:
ఇరువంటి దుర్గా మాధురీదేవి (నాగిని) రచించిన రెండు శతకాలు, ‘దుర్గా శతకము’, ‘మంగళాద్రి వాస శతకము’ల సంపుటి ‘శతక యుగళ మాధురి!’.
‘దుర్గ’ మకుటం కల శతకము విజయవాడ కనకదుర్గ పై రాసిన శతకము. మంగళగిరి పానకాల స్వామి పై వ్రాసిన శతకము ‘మంగళాద్రివాస శకతము’.
దుర్గా శతకము తేటగీతిలోనూ, మంగళాద్రివాస శతకము ‘ఆట వెలది’ లోనూ రచించారు కవయిత్రి.
భక్తి రసాన్ని చారిత్రకాంశాలతో మేళవించి, క్లిష్టతర హితంగా ఈ పద్యాలను సృజించారు.
‘దుర్గా’ శతకము:
మదిని భావనలన్నియు మాలగట్టి
వేడుకొనెదమన్న జనని! వేగలేక
భౌతికపు జీవితము నందు పరుగుతోడ
వడలినాను! గాచుమ నను! ప్రణతి దుర్గ!
~
మంగళాద్రివాస శతకము:
కొండ పైన జూడ గండములను గాచు
దిగువ నేమో నీదు దివ్య దీప్తి
విషయ మేమిటన్న విశ్వమంతయు నీవె!
మంగళాద్రివాస! మమ్ము గనుమ.
***
ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
పేజీలు: 60
వెల: ₹ 100/-
ప్రతులకు:
2-60/13,
జిబిఆర్ కాలనీ,
గుర్రంగూడ
హైదరాబాదు – 501510
ఫోన్: 9963998955
2. సాయి సహస్ర శతకము:
కన్నేపల్లి వరలక్ష్మిరచించిన నైతిక విలువలు చాటి చెప్పే శకతము ‘సాయి సహస్ర శతకము’. ఈ శతక రచనలో రచయిత్రి కంద పద్యాన్ని స్వీకరించారు. ఇందులో పద్యాలు సరళంగా ఉండి సులభంగా బోధపడతాయి. సమాజానికి నైతిక విలువలను బోధిస్తాయి పద్యాలు.
పలుకువ జూపెడి ప్రేము
వలసినప్పుడు చేష్టలందు వర్తింపనిచో
ఫలితము శూన్యము చూడగ
జలనిధి గల నాటి తెరగు సాయి! సహస్రా!
~
ఉసురది యున్నంత వరకు
స్వశక్తితో బనులజేసి శ్వాసను వీడన్
విసువది లేకయు భక్తిగా
శశిధరు బ్రార్థింపవలెను సాయి! సహస్రా!
***
కన్నేపల్లి వరలక్ష్మి
పేజీలు: 32
వెల: ₹ 30/-
ప్రతులకు:
49-24-53/10
విజయ అపార్ట్‌మెంట్స్
మధురానగర్
విశాఖపట్నం – 16
ఫోన్: 9440197990
3. శ్రీ సాయి కృత శతకము:
వేగరాజు సాయి వరప్రసాద్ రచించిన ‘వినుమ సాయి కృతము విదిత హితము’ అనే మాకుటంతో ఉన్న ఆటవెలదుల శతకము ‘శ్రీ సాయి కృత శతకము’. సరళమైన పదాలతో, రమ్యమైన భావాలను ఈ పద్యాలలో వ్యక్తపరచారు కవి. సమాజంలోని రుగ్మతలను ఎత్త చూపుతూ తగిన సందేశాన్ని పద్యాలలో పొందుపరచారు. పద్యాల తాత్పర్యాన్ని కూడా అందించారు.
~
తనకు తాను సుఖము తరలి చెంతకు రాదు
శోక శరధి దాటి శోభిలునట
సఫల కృషి నీయు సవ్యమగు సుఖము
వినుమ సాయి కృతము విదిత హితము
~
కీడుజేయు పరుల తోడునీయు జనులు
సొంత లాభమందు కొంతయున్న
నీతి లేని పోత్తు నిలకడ లేనిదా
వినుమ సాయి కృతము విదత హితము
***
వేగరాజు సాయి వరప్రసాద్
పేజీలు: 52
వెల: ₹ 100/-
ప్రతులకు:
ఫ్లాట్ నెం.101,
బాలాజీ ఎన్‌క్లేవ్, అపార్ట్‌మెంట్స్
బాలాజీ పార్క్ టౌన్, నిజాంపేట్ రోడ్.
హైదరాబాద్ – 500090
4. శ్రీ సుబ్రహ్మణ్య శతకము:
పేరి వెంకట సూర్య నారాయణ మూర్తి రచించిన ‘సుబ్రహ్మణ్యా’ మకుటంగా కల శతకము సుబ్రహ్మణ్య శతకము. భక్తి భావం పరవళ్లు తొక్కు పద్యాలతో లలిత పద బంధాలతో అలరిస్తుందీ శతకం.
విభ్రమదాపదుల గనుచు
నభ్రగ పతి శక్తిసముడు హైమవతీష్టా!
బిభ్రత్రువృద్ద దశలను
శుభ్ర స్ఫటికా! ప్రసీద సుబ్రహ్మణ్యా!
~
నిఖిలంబౌ మంగళాధర
శిఖివాహన దైత్యహారి చేసెద పూజల్
సఖివల్లీశా నీకున్
సుఖశాంతి విభవముల నిడు సుబ్రహ్మణ్యా!
***
పేరి వెంకట సూర్యనారాయణ మూర్తి (అప్పాజీ)
పేజీలు:32
వెల: ₹ 50/-
ప్రతులకు:
బ్లాక్-8, ఫ్లాట్ నెం. 505
మై అవతార్,
నార్సింగి,
హైదరాబాద్ – 500089
ఫోన్: 8897716466
5. శ్రీ మూలేశా శతకము:
జొన్నలగడ్డ శ్రీనివాసరావు ‘శ్రీ మూలేశా’ మకుటంతో, శ్రీ భ్రమరాంబికా సహిత పరమేశ్వర స్వామి పై రచించిన శతకము ‘శ్రీ మూలేశా శతకము’.
కంద పద్యాలతో మూలేశ్వరుని అర్చించిన ఇందులోని పద్యాలు అద్భుతమైన ధారతో పాఠకులను అలరిస్తాయి. భక్తి భావంతో తన్మయులను చేస్తాయి.
~
ఫాలాక్షుడు నీ భక్తుడ
నీ లీలలు మదిని దలచి నిక్కమటంచుం
భావింపుము నను నీవని
చేలమ్ముల నేనొసగుదు శ్రీ మూలేశా !
~
హృదయమున సుధ నిధియును
నిదమును గళమున గలిగిన నిటలాక్షుండు!
యుదగద్రి నీ నివాసము
సృదరము నీ యాభరణము శ్రీ మూలేశా!
***
జొన్నలగడ్డ శ్రీనివాసరావు
పేజీలు: 36
వెల: అమూల్యం
ప్రతులకు:
తొత్తరమూడి
అయినవిల్లి మండలం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆంధ్రప్రదేశ్ 533211
ఫోన్: 9959432046