రచయిత్రి మణి వడ్లమాని తొలి కథా సంపుటి ‘వాత్సల్య గోదావరి’. ఈ సంపుటిలో 24 కథలున్నాయి.
ఈ సంపుటిలోని కథా వస్తువులన్నీ ఇంటింటా జరుగుతున్న రామాయాణాలు, మహాభారతాలూ కొన్ని కొన్ని మహా భాగోతాలు అంటూ ‘కథల్లో మణిగారి అధ్యయనశీలం, సమాజ పరిశీలనా దృష్టీ, జీవితానుభవాల సారం – విస్తృతంగా ప్రతిఫలిస్తున్నాయని ‘తోటి మనుషుల సుఖదుఃఖాలు’ అన్న ముందుమాటలో విమర్శకులు విహారి రాశారు. కథానికకి అనువైన నేపథ్యాన్నీ, వాతావరణాన్ని కూర్చటం – మణి గారి రచనాశిల్పంలో కొట్టవచ్చినట్టున్న మెరుపని ఆయన అభిప్రాయపడ్డారు.
‘మరపురాని మంచి ముత్యాల సమాహారం -మణి వడ్లమాని కథా సంకలనం’ అన్న పరిచయంలో రచయిత్రి మంథా భానుమతి “వైవిధ్యమైన కథా వస్తువు నెన్నుకోవడం మణి ప్రత్యేకత. కథలో తిలక్, చలం, అజంతా, అడవి బాపిరాజు, కృష్ణశాస్త్రి వంటి ప్రముఖ రచయితల వాక్యాలను, కవితలను సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ, ఆ విధంగా కథకు అలంకారాలను అద్దటం కూడా తన విశిష్టత. విలక్షణమైన కథనం మణిది. కథకి పేర్లు ఎన్నుకోవడంలోనే రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఈ సంకనంలో ఉన్న ఇరవై నాలుగు కథల్లోనూ, కథాంశంలో కానీ, శైలిలో కానీ దేని ప్రత్యేకత దానిదే” అని వ్యాఖ్యానించారు.
ఈ సంపుటిలోని 24 కథలలో ‘మేనిక్విన్’, ‘సరస్వతీ నమస్తుభ్యం’, ‘వాత్సల్య గోదావరి’, ‘కృష్ణం వందే జగద్గురుం’ వంటి కథలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
వాత్సల్య గోదావరి
వెల: రూ.100/-
పేజీలు: 200
ప్రతులకు: జ్యోతి వలబోజు, ఫోన్: 80963 10140,
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
~ సంచిక బుక్ డెస్క్
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మహతి-70
వృక్ష విలాపం
రెండు ఆకాశాల మధ్య-15
మహాప్రవాహం!-4
TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
జీవన రమణీయం-31
వాయులీనం
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 53-54-55 రామ సముద్రం, మినికి ఆలయాలు
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-31
అలనాటి అపురూపాలు- 183
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®