దేశంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.
తెలుగు సినిమా తెగువ జూడగ తెలివి పారిపోవు నందురు. పేరు పెద్ద, ఊరు దిబ్బయను సామెతకు సరిపోవునంట. విశ్వభాషల సిన్మాకంటె తెలుగు సినిమా లెక్కువాయె. నటనలో జీవమ్ము కరువు పాటలో పాటవము లేదు. మాటలలో మానితము కరువు ఆటలో అంకితము శూన్యము.
***
రాశి పెద్దది వాసి చిన్నది ప్రచారమున పండిపోయెను. గీతమెంతో గొప్పదైనను సంగీతము మింగివేసెను. పాత సినిమా కళా రూపము కొత్త సినిమా కుండదాయె. సినీ ‘పరిశ్రమ’ స్థాయి కెదిగి ఉత్పత్తుల ఉన్నతాయెను. కళాదృష్టియె కల్లలాయెను పోటీ మాత్రం పెరిగిపోయెను.
భారతీయ సంస్కృతి మహా భాగ్యముగా దలచరాయె. నటీనటులే పెరిగిపోయిరి నాణ్యత గమనించరైరి. అఖిల భారత స్థాయినందున అందిరాదు అసలు బహుమతి. క్లాసు నవలల కథలు సిన్మా కథలుగా రూపొందించరు. ఆస్కారు అవార్డుకైననూ ఆస్కారమె లేదు బాబూ!
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అవధానం ఆంధ్రుల సొత్తు-14
శ్రీమతి – శ్రీవారు
మహానుభావురాలు
నీడ తొక్కిన ఆట!
జరుగుతున్న కథ
ఒక స్ఫురణ
నీలమత పురాణం-2
మా మధ్య ప్రదేశ్ పర్యటన-3
అడిగోపుల మరణానికి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం సంతాపం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®