Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వారెవ్వా!-47

పుస్తకాలు మస్తకాలలో
జ్ఞానార్జన గూడుగట్టును.
టెలీవిజన్లు, స్మార్టు సెల్లులు
మానసిక రోగాల దారి.
జ్ఞానర్జనము వెనుకబడెనా
సాంకేతిక యుగము నందున.
మెగా డైలీ సీరియల్సును
సినిమాలదే రాజ్యమాయె.
బుక్కు కల్చర్ తరిగిపోయెను
లుక్కు కల్చర్ పెరిగిపోయెను.

***

వీనుల విందు, కనుల పండుగ
దృశ్య, శ్రవణ యంత్రములదే.
లాగి, సాగిన సీరియల్సును
మధ్యలో ఆపేయలేరు.
సస్పెన్సులో, థ్రిల్లింగులో
సాగదీసే జిమ్మిక్కులు.
ప్రపంచాన్నే మరిచిపోదురు
పరవశింతురు సామాన్యులు
పనులు గూడ వదిలి వేసియు
ఆనందము ననుభవింతురు.

***

తాత్కాలికము లుక్కు కల్చరు
శాశ్వతమ్ము బుక్కు కల్చరు.
ఎంత చూసినా ఏమి లాభము?
బుర్ర గిర్రున దిరుగుచుండ.
ఉన్న తెలివియె ఉరుకులాడును
లేని చేడు అలవాట్లు చేరును.
లేడీ విలనులు తయారౌదురు
యువత బుర్రలు బూజులు బట్టును.
తెలుసుకుంటే తెలివి గుంటది
పుస్తకము మస్తకము మందు.

Exit mobile version