Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వరమివ్వు ప్రియా..!

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘వరమివ్వు ప్రియా..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీ అధరంపై
తారనై మెరవనా
నీ చూపులలో
బింబమై నిలవనా
నీ దరహాసంలో
పువ్వునై పూయనా
నీ నుదుట పై
సిందూరమై చేరనా
నీ పలుకులో
పదమునై పాడనా
నీ నడకకు
పాదమునై సాగనా
నీతో
ఏడడుగులు నడవనా
నీ మెడలో
పసుపు తాడై మురవనా
నీతో జన్మ జన్మలా
ప్రేమ సాగరంలో మునగనా
వరమివ్వు ప్రియా..!

Exit mobile version