Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాళ్ళు తమతో ఏం తీసుకుపోయారు?

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘వాళ్ళు తమతో ఏం తీసుకుపోయారు?’ అనే కవితని అందిస్తున్నాము.]

రాజులు మహారాజులు
భూస్వాములు
ధన స్వాములు

వాళ్ళు తమతో ఏం
తీసుకుపోయారు

దోపిడీదారులు
హింసావాదులు
ఉగ్రవాదులు

వాళ్ళు తమతో
ఏం తీసుకుపోయారు

మతవాదులు
ప్రాంతీయవాదులు
భాషావాదులు

వాళ్ళు తమతో
ఏం తీసుకుపోయారు

అబద్ధాల కోరులు
అధర్మ పాలకులు
అక్రమ సంపాదనాపరులు

వాళ్ళు తమతో
ఏం తీసుకుపోయారు

ఏమీ తీసుకుపోలేదు
ఏమీ తీసుకుపోము

Exit mobile version