
సాహితీలోకంలో ఉత్తర రామాయణం గురించి చాలా వివాదాలు ఉన్నాయి. అయితే జానపద సాహిత్యంలోనూ, జనం నోళ్ళలోనూ లవకుశ, భూకైలాస్ వంటి గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నాటకాలూ, సినిమాలూ మనకు తెలుసు. తిక్కన, కంకటి పాపరాజు, వాసుదాసు వంటి మహాకవులు ఉత్తర రామాయణం రాసేరు. మహామహోపాధ్యాయులు ఆచార్య పుల్లెల వారు వాల్మీకంకి రెండు సంపుటాలుగా వ్యాఖ్యానమూ రాశారు. ఆ కారణం తోనే 6500 పద్యాల ఛందస్సుందర శ్రీ పదచిత్ర రామాయణం కవి – విహారి – తానూ ఉత్తర రామాయణం రచన చేశానన్నారు. అధిక సంఖ్యలో పాఠకులకు చేరాలనే వాంఛితంతో వచనంలో రాసేనన్నారు. ఉత్తర రామాయణం పేరుని ‘ఉత్తర రామచరిత’గా నిర్ణయించటానికి కథావస్తు కేంద్రం, కథానాయకీనాయకులు సీతారాములు కావటమే కారణమన్నారు.
‘సంచిక’లో ధారావాహికగా వెలువడి పాఠకుల నుండి అపూర్వమైన స్పందనని పొందిన విహారి గారి ఊహా చారిత్రక నవల ‘జగన్నాథ పండితరాయలు’ వలెనే ఈ వచన రచన కూడా అంతటి పాఠకాదరణని పొందుతుందని ఆశిస్తున్నాము.
అద్భుతమైన దృశ్యీకరణ శైలిలో సరళ సుందరంగా సాగిన వచనం చదువరుల్ని బాగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.
***
వచ్చే వారం నుంచే
ఉత్తర రామచరిత – ధారావాహిక
చదవండి, చదివి స్పందించండి.
