మనసు
బాహ్య వస్తువు కాదు
బాహాటంగా కనిపించడానికి..
కంటికి కనిపించదు కదా! అని
దానికి ఉనికి లేదనుకుంటే పొరపాటే
మదిలో మెదిలే
ఆలోచనల ప్రకంపనలే స్పందనలు
మనకు కనిపించే దేహాన్ని
చైతన్యమనే ఇంధనం
నడిపిస్తున్నట్టు
మనలోని మనసుకి
మనసే సాంత్వన..
మనసు నిజ స్వరూపాన్ని
తెలుసుకోవాలంటే..
మనిషి సన్మార్గ దిశగా
అడుగులేయాలి..
అదే ఉత్తమమైన మార్గం!
లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.