Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వుండాలోయ్ ఓ లక్ష్యం..!

ప్పటికప్పుడు పుట్టింది..
మదిలో ఓ ఆలోచన..
‘ఏంటి ఈ జీవితం?’.. అనే ప్రశ్న….
అర్థమవుతున్నట్లే వుండి అయోమయం లోకి నెట్టేసే సంకటం!
పగలంతా పని హడావుడి.. తీరూ తెన్నూ లేక సాగే పయనం..
రాత్రవుతూనే సెలవడిగే కన్నులు..
పగటి కష్టం ..అంతా రాత్రి నిద్రగా మారిపోతుంది!

కానీ నేస్తం..
లక్ష్యం లేని జీవితం వ్యర్థం!
ఆ ‘లక్ష్యం’ ఆశగా.. శ్వాసగా మారితే..
ఇక.. లక్ష్యమే కదా జీవితం!
అనుకున్న..
కోరుకున్న..
నిర్దేశించుకున్న..
లక్ష్యాన్ని అందుకోవడం.. చేరుకోవడమే జీవిత పరమార్థం!
ప్రతి మనిషికీ.. ‘ఓ లక్ష్యం’
‘ఇది సాధించాలి అన్న ఓ పట్టుదల’.. వుండాలి..
అప్పుడే కదా జీవితం అర్ధవంతమయ్యేది!
సమాజంలో నలుగురికి ఆదర్శవంతమయ్యేది!

Exit mobile version