Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగ్రవాదం – విశ్వరక్షణ

[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘ఉగ్రవాదం – విశ్వరక్షణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

గ్రము మూలమై ఉద్భవించిన వాదము
భయము కలిగించి పంతము నెగ్గించుకొన
పాశవిక మార్గముల నెంచుకొను వ్యక్తుల
మానసిక ప్రతిచర్య, ఆత్మన్యూనతాభావనల
స్వీయ రక్షణలకై, సమాజ వ్యతిరేక మార్గాల
అలరారు మానసిక రుగ్మతయే ఉగ్రవాదము
వ్యక్తిన జనించిన ఉగ్రతత్వము వ్యష్టిగా మారి
సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను
అస్థిరపరచి, దేశాలు దాటి అంతర్జాతీయ మయ్యె
రాజ్య స్వాధీనమే లక్ష్యముగా రాజకీయ ఉగ్రవాదము
రాజ్య సంపదలెల్ల వశపరచుకొనుట ఆర్ధిక ఉగ్రవాదము
సమాజ అసమానతల సాకుగా సామాజిక ఉగ్రవాదము
రాజకీయ పటాన వామ కుడి పక్ష సైద్ధాంతికోగ్రవాదము
మత పర భావజాలాల ప్రేరేపింపబడు మతోగ్రవాదము
నేర ప్రవృత్తుల లాభమొంద వెలసిన నేరోగ్రవాదము
ఇన్ని ఉగ్రత్వములు ఏకమయ్యి విశ్వశాంతిని నేడు
భంగపరచి, భయమున జనుల బ్రతుకులు మార్చివేసె
దేశ విభజనన విడివడిన దాయాది దేశపు దినచర్యయై
వివిధ ఉగ్రవాద సంస్థల వివిధ రీతుల పెంచి పోషించి
భారతావని నుదుట సిందూరమును తుడువ నెంచిన
‘పహల్గామ్’ దాడిపై ప్రతీకార చర్య ‘సిందూర్ ఆపరేషన్’ రీతి
ఉన్మాదమునకు ఉన్మాదమే సమాధానమని తలంచి
విశ్వదేశములన్ని వివక్షలు మాని ఉగ్రమూకల మట్టుబెట్ట
బూన విశ్వ దేశముల శాంతి విరిసి, సౌభాగ్యాలు వృద్ధి చెందు
మార్గ మిదియెను నేటి ఉన్మాద చర్యలకు, విశ్వ రక్షణకు.

Exit mobile version