[కనపర్తి రాజశేఖరమ్ గారు రచించిన ‘ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
చైత్ర శుక్ల పాడ్యమి
తొలగించును జగత్తు జాడ్యమి
బుుతువుల్లో శ్రేష్ఠరాజం వసంతం
కళా కాంతులతో శోభిల్లును ఆద్యంతం
పుడమి నిండా క్రొంగ్రొత్త పూల పరిమళం
ప్రకృతి అంతా ప్రతిధ్వనించు కోయిలగళం
జగతిన తొలకరించు చైతన్య సృష్టి
ఉగాదితో జనించు అనంత పుష్పవృష్టి
కాలవిభాగ బుుతుపరివర్తనమే ఉగాది
దినమాస సంవత్సరాగమనానికి పునాది
పరోపకారార్థమే ఉగాది పరమావధి
జగత్కళ్యాణానికి సూక్ష్మ సూత్రనిధి