Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది

[కావైశ్రీ గారు రచించిన ‘ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

యుగానికి ముందు నించి ఉన్నది
యుగాది నానుడితో మారింది ఉగాది.
ప్రతి ఒక్క రోజుని సరికొత్త రోజుగా మార్చే రోజు ఇది.
కొత్త చిగురాకులతో చిగురిస్తాయి చెట్లు
కోయిలమ్మ స్వరాలతో పారిపోతాయి మన ఇక్కట్లు
వసంతం రాకతో సంతోసం విరబూసినట్లు
కలగలిపి తెస్తుంది నవ్వులు, పువ్వులు సిరులతో మెరిసి పోయేట్లు
లోగిళ్ళ వాకిళ్ళు రంగవల్లులతో రతనాల ముగ్గులు
కొమ్మారెమ్మలతో గుమ్మాలకు పచ్చని తోరణాలు
ఆనవాయతీగ అద్దేరు గడపలకు పసుపు కుంకాలు
క్రొంగొత్త తనాన్ని మురిపిస్తూ ధరించే నూతన వస్త్రాలు
ప్రకృతిలో రమణీయమ్
జీవితాలకు కమనీయమ్.
1. వేపపూపు చేదు; 2. మామిడి వగరు; 3. చింత పులుపు;
4 బెల్లపు తీపి; 5. మిరియాల ఘాటు; 6. అరటి కమ్మని.
ఉగాది పచ్చడి రసోమయమ్.
అది చూసి అందరి జీవితంలోని కష్టాలు, నష్టాలు, బాధలు
రాదులు, కోపం, తాపముల నుండి నిలదొక్కుకొని సంతోషాన్ని
ఆస్వాదించుకుంటే రసమయమ్.
అలవరుచుకుంటే అంతా అమృతమయమ్.

Exit mobile version