Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉగాది..!

[జయాశ్యామ్ గారు రచించిన ‘ఉగాది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

డచిన కాలానికి, గ్రహించలేని గమనానికి,
మధ్య వారధి!

ఓడిన ప్రతిసారీ, ఓదార్పుగా యింకోసారి,
వేస్తుంది పునాది!

జరగబోయేది షడ్రుచులతో చూపి..?
ముందుగానే వారిస్తుంది।

‘చేదు’ లేని జీవనం, ఎరుగలేదు ‘తీపి’ మధురం!
బాధ లేని బ్రతుకు, సుఖాల నిశ్శబ్ధ నరకం!

‘పులుపు’ లేని వలపు, ‘ఉప్పు’ లేని వంట వగపు!
‘కారం’ మమకారపు వెటకారం!
‘వగరు’ లేని పొగరు, ఆత్మవిశ్వాసం!

పడిన కష్టాలను పాఠాలుగా..!
పోరాడే జీవనాల మార్గాలుగా మార్చే మన
‘సంస్కృతి’
జీవితాన్ని, జీవన సారాన్ని రుచి చూపే, మార్గదర్శి
మన ‘ఉగాది’

Exit mobile version