సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. గోపాలకృష్ణ గారి వ్యాఖ్య: *మీ జీవన యాత్రలోని విశేషాలు చదువుతుంటే మాకు కూడా మా చిన్ననాటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయి.
    మరన్నట్లు ఆ రోజుల్లో దెయ్యాలు ఆలోచనలు మనల్ని చిన్నతనంలో బాగానే భయపెట్టాయి. మీరు చివర్లో చక్కటి సైంటిఫిక్ రీజన్స్ ఇవ్వడం బాగుంది. భయం అదొక మానసిక భావనని చక్కగా తేల్చారు .మధ్యలో సినిమా విశేషాలు చెబుతూ మీ ఇంగ్లాండ్ యాత్ర అనుభవాల వివరణ ఆకట్టుకున్నాయి.
    మీరన్నట్లు సింగిల్ ప్రొజెక్టర్ తో సినిమా ధియేటర్లు నడిచే రోజుల్లో…పవర్ కట్లతో జనరేటర్ లు లేక… సినిమా ఆగిపోతే పాస్ లిచ్చి మర్నాడు రమ్మనేవారు….అలా నేను అగ్గి రాముడు సినిమా చూడటం జరిగింది. ఇంకా దెయ్యాల ప్రస్తావన కొస్తే…దసరా సెలవులకు అమ్మమ్మ గారి ఊరు వెళ్ళేవాళ్ళం. రాత్రిపూట ఆరుబయట చాపమీద పడుకుని కధలు వింటూ పడుకునే వాళ్ళం. ప్రహారీ గోడవతల పెద్ద చింత చెట్టుండేది. ఆ చెట్టుమీద దెయ్యం కదులుతుంది చూడమని మా చిన మావయ్య భయపెట్టే వాడు… తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది….
    అభినందనలు తుర్లపాటి రావుగారు. మీ నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తూ.
    – M. GopalaKrishna , Kakinada*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నూకల ప్రభాకర్ గారి వ్యాఖ్య: * మా చిన్ననాటి సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. మీరు ఉటంకించిన విషయాలన్నీ మాకందరికీ అనుభవమే. ఆ రోజుల్లో ఆకాశంలో శవయాత్ర – ఈ వార్త దినపత్రికలో కూడా ప్రచురితమైంది. పైగా ఔరంగాబాద్ లో కనబడిందంటూ చెప్పుకునే వారు. మీరు చెప్పిన విధానం బాగున్నదండి.
    – నూకల ప్రభాకర్ (హైదరాబాద్)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి వ్యాఖ్య: *ఈవారం “భయం” చుట్టూ తిరిగిన “జీవన సాఫల్య యాత్ర” చదువుతుంటే నా చిన్నతనంలో జరిగిన “ఓ స్త్రీ రేపురా” రాతల రోజులు గుర్తుకు వచ్చాయి.
    దానితోపాటు నేను చదివిన రావి కొండలరావు గారి జీవిత చరిత్ర “నాగావళి నుంచి మంజీర వరకు” లోని ఒక సంఘటన చిన్నగా చేసి ఉటంకించాలనిపిస్తోంది.
    ఆయన అయదో ఫారం అంటే పదవ తరగతి చదివే రోజులలో అంటే ఆయన పుట్టినది 1932 కనక సమారుగా 1947 అనుకోవచ్చు. స్నేహితుడితో కలిసి సైకిలు మీద పక్క ఊరులో second show సినిమా చూసి, పెద్ద సినిమా అవటం వలన, సుమారు రాత్రి 2.00 గంటల ప్రాతంలో తిరిగి వస్తుంటే బాగా దాహం అయిందిట. రోడ్డుకి కొంచం దూరంగా కాగడాలు, బాజాలు, జనంతో పెళ్ళి సందడి జరుగు తున్నట్లుగా అనిపించి అక్కడకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారుట. ఒక పెద్దాయన వాళ్ళకి అరిటి పళ్ళు పెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చారుట. పళ్ళు తిని నీళ్ళుతాగి బాగా నిద్దర వచ్చి అక్కడే అరుగు మీద శయనించి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారుట. ఉదయం సమారు 8.00 గంటల ప్రాతంలో మెళుకువ వచ్చిందిట లేచి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుంటే ఇద్దరూ శ్మశాన భూమిలో చెరొక సమాధి మీద ఉన్నట్లు తెలిసిందిట. ఇంటికి వెళ్ళి ఇద్దరూ ఒక నెలరోజుల జ్వరంతో బాధపడితే పెద్ద వాళ్ళు, మామూలు వైద్యులు తోపాటు భూత వైద్యులు తో కూడా వాళ్ళకి వైద్యం చేయించారుట. ఇంత వరకూ చెబితే చాలనుకుంటాను ఈ సందర్భానికి సంబంధించినంత వరకూ.
    – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!