సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పరకాల రాజేశ్వర రావు గారి వ్యాఖ్య:*
    ఈ వారం తుర్లపాటి వారి జీవన సాఫల్య యాత్రలో ప్రస్తావించిన ‘గాలి గోపురం’ విషయం చదువుతుంటే సత్యం శంకరమంచి గారి అమరావతి కధలలోని ‘శిఖరం’ కధ, అందులో తొమ్మిది అంతస్తుల ఎత్తైన గాలిగోపురం కధనం. అలాగే తిరుమల రామచంద్ర గారి స్వీయచరిత్ర ‘హంపి నుంచి హరప్పా దాకా’ లో‌ ‘చిత్తూరు జిల్లాలో కాంగ్రస్ ప్రచారం’ అనే భాగంలో తిరుపతి గోవింద రాజస్వామి గుడి 12 అంతస్తుల మహాద్వార గోపురంలో దీపాలు వెలిగించే వ్యక్తిని మచ్చిక చేసుకుని, అతను అయిదవ అంతస్తు వరకే తనతో రానిస్తే, అతను పై అంతస్తులలో దీపాలు వెలిగించటానికి వెళ్ళి వచ్చేలోపు ఆ అయిదవ అంతస్తులో త్రివర్ణ పతాకం కట్టి ఏమీ ఎరగనట్టు అతనితో కలసి కిందకి దిగేసిన ‘తిరుమల’ వారి సాహసం తలపుకి వచ్చాయి.
    ఇక ఆస్తికంగా ఆలోచిస్తే తుర్లపాటి వారిని మంగళగిరి నరసింహ స్వామే కాపాడి ఉంటారు. వీరి నాన్నగారు ఆయన సేవలోనే ఉన్నారు కదా మరి.
    – పరకాల రాజేశ్వర రావు (హైదరాబాద్)*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తల విజయబాబు గారి వ్యాఖ్య: * జీవితం విలువ తెలియక చేసిన దుందుడుకు/సాహసోపేత ఆటలు/పనులు గుర్తుకొస్తే కాలం మనల్ని ఎంత చల్లగా చూసిందా అని అనిపిస్తోంది.. ఈ వారం 13 వ భాగం చదువుతుంటే!
    ఇవాళ తరం వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం తీసుకొనే జాగ్రత్తలు, అవగాహన మన తరంలో లేవు కాబట్టి ఓ లాభం – ఇక, మన బాల్యం చాలా rich గా ఉంది. ఓ నష్టం – బోల్డన్ని గండాలు, సుడి గుండాల నుండి బయట పడి బట్టకట్టాం.
    చాలా టచింగ్ గా ఉంది ఈ వారం, మీ రచన – కస్తల విజయబాబు (హైదరాబాద్)*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరాదేవి గారి వ్యాఖ్య:* తుర్లపాటి గారు మీరు ఎంత సాహసం చేసారండి అంత చిన్నప్పుడు. 13వ భాగం చదువుతుంటే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అమ్మగారు నాన్నగారు అక్క అన్నపూర్ణ దేవి గారు మీ ప్రాణ స్నేహితులు మీ ప్రాణాన్ని నిలబెట్టారు అని అనుకోవాలి. అందుకే కాబోలు మీరు ప్రజలందరికీ పాఠకులందరికి అన్నీ తెలియజేయాలని గండాలు దాటుకుని జర్నలిస్టుగా తయారయ్యారు.
    మీరు జర్నలిజానికి ఎంతో సేవ చేయాలని ఆ భగవంతుడు మీకు ఆశీర్వదించి మీ ప్రాణాన్ని రక్షించినట్లుగా నాకు అనిపిస్తున్నది. మీరు ఇంత పెద్ద జర్నలిస్టు ఎన్నో అనుభవాలు ఎంతోమంది ఇంటర్వ్యూలు ఎన్నో అవార్డులు అందుకున్నారు మీరు. – పి. ఇందిరా దేవి (సికింద్రాబాద్)*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ ఎం. విష్ణువర్ధన రావు గారి వ్యాఖ్య: *తుర్లపాటి నాగభూషణరావు గారి జీవన సాఫల్య యాత్ర 13వ భాగంలో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి గాలి గోపురం గురించి చెప్తుంటే, యాదృచ్ఛికమో లేక దైవ సంకల్పమో గాని ఆదివారం ఉదయం మేము అదే గుడిలో అదే గోపురం కింద కూర్చొని స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. ఇంటికి రాగానే ఆయన వ్రాసిన 13వ భాగం పూర్తిగా చదివాను.
    మనకు తెలిసి తెలియని వయసు, భయము, బాధ, భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు ఉండని రోజులవి. నాగభూషణ రావు నా చిన్ననాటి స్నేహితుడు. విశాఖపట్నంలో ఉన్నప్పుడు డిగ్రీ పేపర్లు దిద్దడానికని కొంతమంది లెక్చరర్స్ ముఖ్యంగా నాకు గుర్తుండి ఇన్నయ్య గారు, గరికిపాటి వెంకటేశ్వరరావు గారు కొంతమంది టీచర్స్ వచ్చి మా రూమ్ లో ఉండేవారు. పిల్లల పట్ల వారి శ్రద్ధ, ఆలోచనలు వింటుంటే మాకు ఆశ్చర్యమేసేది. మేము చిన్నప్పుడు తెలిసీ తెలియక చేసిన చేష్టలతో తల్లిదండ్రులను ఎంతగా మానసిక క్షోభకు గురిచేశామా అని తలుచుకుని సిగ్గుపడే వాళ్ళం.
    నందిగామ మున్నేరు లోకి వెళ్లి ఈత సరిగా రాకుండానే దూకడం, మోటార్ సైకిల్ సరిగా నేర్చుకోకుండానే తోలడం, కొండలు ఎక్కటం.. ఇవన్నీ ప్రమాదకర చేష్టలే. ఈ రచన చదువుతుంటే ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఈత రాకుండా నీళ్ళలోకి దూకేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి వార్తలు పేపర్లలో చదువుతున్నప్పుడు ఆ నాటి సంఘటనలు గుర్తుకు వచ్చి ఒళ్ళు జలదరిస్తోంది. ఎంత అమాయకంగా ఈ జీవితాన్ని గడిపామా అనిపించింది. కే.విజయ్ బాబు గారు చెప్పినట్లు మనకు ఏమన్నా అయితే ఆ తల్లిదండ్రులు ఏమైపోతారో అని కూడా తెలియకుండా ప్రవర్తించి ఉంటామని ఇప్పుడు అనిపిస్తోంది. తలచుకుంటే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి.
    ఇలాంటి సంఘటనలు వారం వారం తన రచన ద్వారా అందరికీ పంచిపెడుతున్న రచయిత అభినందనీయుడు. – – డాక్టర్ ఎం. విష్ణువర్ధన రావు (విజయవాడ) *

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!