ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1 న కరీంనగర్ లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది.
వారాల ఆనంద్ వెలువరిస్తున్న 25వ పుస్తకమిది. ఇటీవల తాను రాసిన పుస్తకాల్ని తాను చదువుకున్న విద్యాసంస్థల్లో ఆవిష్కరించుకునే ఒరవడిని మొదలు పెట్టిన ఆయన గత ఏడాది ‘యాదొంకి బారాత్’ని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో, ‘కరచాలనం’ పుస్తకాన్ని కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించారు.
‘త్రివేణి’ కవిత్వాన్ని పాఠశాల స్థాయిలో తనకు హిందీ నేర్పిన ఉపాధ్యాయుడు శ్రీ ఉడుత రాజేశం ఆవిష్కరిస్తారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల నడుమ ఆవిష్కరణ జరగడం సంతోషమని ఆనంద్ అన్నారు. పలువురు ఆత్మీయులు కవులు హాజరవుతారు. కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
– వి.ఇందిరా రాణి, పోయెట్రీ ఫోరం. కరీంనగర్