అవునూ… ఇంతకీ నేను
ఆనందాన్నిచ్చే కల్పవృక్షాన్నా
పీకి పారేసిన కలుపు మొక్కనా
ప్రశ్నల పద్మవ్యూహంలో
ప్రాణం ఇంకిపోయింది
పెదవి విప్పలేని వినయం అప్పుడు
విషం కక్కుతున్న విషవలయంలో ఇప్పుడు
కాలగర్భంలో కలిసిపోతానా
కలల తీరంలో నిన్నల్లుకుపోతానా
నాకైతే తెలీదు…
నీకైనా తెలుసా నేస్తం?
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి స్పందన: *ఈ వారం నిడివి తక్కువగా ఉంది. అప్పుడే అయిపోయిందా అనిపించింది.. అయినా విషయం ఎంతో విలువైనది.. విద్యని పాండిత్యాన్ని…