[ఆనం ఆశ్రిత రెడ్డి గారు రచించిన ‘తెలుగు తోరణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కమ్మని భాష తెలుగు,
కవి కలానికి వెలుగు.
అద్భుతం తెలుగు భాష,
అల్లుతుంది కవితకు శ్వాస.
నా తెలుగు అక్షరాల సేన,
పుడుతుంది పదాల వీణగాన.
నా తెలుగు వాక్యాలతో గురి,
మోగుతుంది విజయాల భేరి.
నా తెలుగు పుస్తకాల్లో ప్రగతి,
ప్రోత్సాహంతో నడుస్తుంది జగతి.
నా తెలుగు నవలలకు నిలయం
నవయుగ నిర్మాణానికి ఆలయం
నా తెలుగు సాహిత్య సంద్రం,
రచయిత రాతలతో రాణించే కేంద్రం.
నా తెలుగు పలకరింపులో ప్రేమ,
బంధుత్వబలానికి సరిగమ.
నా తెలుగు మరో రూపం,
స్నేహ సైన్యానికి దీపం.
రచనై నన్ను నడిపే ఓడ,
రచయిత్రిగా నాతో నడిచే నీడ.
ఎన్నో రచనలకు జోలపాట,
ఎందరో కవులకు గెలుపు బాట.