[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
సమాజ సేవా రంగం:
మాచాని సోమప్స (1904-1978):
నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి (1915-1978):
శ్రీమతి శాంతా సిన్హా (1950 జనవరి 7):
శ్రీమతి బిల్కిస్ ఇద్రిస్ లతీఫ్ (1930 – 2017 అక్టోబరు):
సామాజిక కార్యకర్త. రచయిత్రిగా మంచి పేరు. మురికివాడల నిర్ములనకు కృషి చేసినందుకు 2009లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. INTACH వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఆలీ యావర్ జంగ్ కుమార్తె. ఆయన మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశారు. బిల్కిస్ భర్త ఇ.హెచ్. లతీఫ్ ఎయిర్‍ఫోర్స్ చీఫ్ మార్షల్‌గా, మహారాష్ట్ర గవర్నరుగా ఉన్నారు. ఆమె అనేక గ్రంథాలు రచించారు.
బి. మునిరత్నం (1936 జనవరి – 2021 మే):
డా. అనుమోలు శ్రీరామారావుకు 2014 లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. 76 ఏళ్ళ శ్రీరామారావు రెండు లక్షల డెబ్బయి వేల మంది రోగులను సేవాదృక్పథంతో పరీక్షించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు (2010-11). 1995లో డా. బి. సి. రాయ్ జాతీయ అవార్డు లభించింది.
డా. టి. వి. నారాయణ (జులై 1925- జనవరి 2022):
విద్య, సామాజిక రంగాలలో సుపరిచితులు. తెలంగాణా నుంచి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుని స్థాయికి ఎదిగారు. మంత్రిగా పనిచేసిన టి. యన్. సదాలక్ష్మి వీరి ధర్మపత్ని. ఉపాధ్యాయుడిగా తెలంగాణ పాఠశాలల్లో పనిచేశారు. 1974లో హైదరాబాదు సిటీ కళాశాల ప్రిన్సిపాల్. 20 దాకా పుస్తకాలు వ్రాశారు. 2016లో ‘పద్మ శ్రీ’ లభించింది. 71వ ఏట కర్నాటక విశ్వవిద్యాలయం నుండి హి.హెచ్.డి పొందారు.
సునీతాకృష్ణన్ (1972):
డా. సంకురాత్రి చంద్రశేఖర్ (కాకినాడ):
విద్యావైద్యరంగాలలో 30 సంవత్సరాల కృషికి ఫలితంగా 2022లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. సమాజంలో దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. చదువు చెప్పి వారి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి 1982లో పాఠశాల ప్రారంభించారు. కంటివైద్యం కోసం 1999లో ఆసుపత్రి స్థాపించి 30 వేల మందికి నేత్రదానం చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేశారు. వారి జీవితాలలో వెలుగులు నింపారు. సంగీత కళాశాల స్థాపనకు సహకరించారు.
ఈ విధంగా సమాజ సేవ చేసిన పలువురు ప్రముఖుకు ‘పద్మ శ్రీ’ లభించడం విశేషం.
విద్యారంగం:
శ్రీమతి వనజా అయ్యంగార్ (మరణం 2001):
హైదరాబాదులో విద్యాభ్యాసం చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి గణితంలో ఉన్నత విద్య చదివారు. కోఠి మహిళా కళాశాల, నిజాం కళాశాలల్లో ఉపన్యాసకురాలిగా పని చేశారు. 1958లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాదించారు. 1983లో తిరుపతిలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్‌లర్ గా నియమితులై 1986 వరకు వ్యవహరించారు. హైదరాబాదులోని ఆంధ్ర మహిళా సభ అద్యక్షురాలిగా 1994 నుండి 2001 వరకు సేవలందించారు 1987లో ‘పద్మ శ్రీ’ లభించింది.
శ్రీమతి. వి. కోటేశ్వరమ్మ (1925-2019):
సివిల్ సర్వీస్ అధికారులు:
ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నత హోదాలలో పనిచేసిన పలువురికి ‘పద్మ శ్రీ’లు ప్రకటించారు. వారి వివరాలు.
చల్లగళ్ల నరసింహం:
ఐ.ఎ.ఎస్. అధికారిగా చెన్నై పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారు. చెన్నై కార్పొరేషన్ కమీషనరుగా 1947-53 మధ్య పనిచేశారు. హైదరాబాదులో జుబ్లీహిల్స్ అభివృద్ధికి కారకులు. ఆయన ఆత్మకథ ‘Me and My Times’ అనేక నూతన అంశాలను వెల్లడించింది. 1962లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. అదే సంవత్సరం వి. వి. రామచంద్ర కూడా ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు. 1974లో డా. హరి నారాయణ ఈ విభాగంలో అందుకొన్నారు.
నార్ల తాతారావు (1917 సెప్టెంబర్ – ఏప్రిల్ 2007):
విద్యుచ్ఛక్తి రంగంలో జాతీయస్థాయిలో ఖ్యాతి గడించారు. కృష్ణా జిల్లా కౌతారంలో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు. చికాగో విశ్వవిద్యాలయం నుండి యం.యస్. చేశారు. 1958లో మధ్యప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ బోర్డ్ వ్యవస్థాపకులుగా చేరి కేంద్ర జల కమీషన్ సభ్యులయ్యారు. 1974లో ఆంధ్రప్రదేశ్ విద్యుచ్ఛక్తి బోర్డులో చేరి 1988 వరకు విశేష కృషి చేశారు. రాష్ట్ర విద్యుచ్ఛక్తి అవసరాలను గుర్తించిన నిపుణుడు. 1983లో ‘పద్మ శ్రీ’ లభించింది.
త్రిపురనేని హనుమాన్ చౌదరి (1931 అక్టోబరు):
డా. కోట హరినారాయణ(1943):
బరంపురంలో జన్మించిన వీరు తేజస్ యుద్ధ విమాన ప్రాజెక్టు డైరక్టరు, చీజ్ డిజైనరు. యానివర్శిటీ ఆప్ హైదరాబాదు వైస్ ఛాన్సలర్‍గా 2002-2005 మధ్య వ్యవహరించారు. 1967లో బెంగుళూరులో HAL లో ఇంజనీరుగా చేరారు. DRDO లో 1970 నుండి 1988 వరకు పనిచేశారు. 1985-2002 మధ్య ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ డైరక్టర్‌గా విశేష కృషి చేశారు. 2002లో ‘పద్మ శ్రీ’ సత్కృతులయ్యారు.
వాణిజ్య పారిశ్రామిక రంగాలు:
1958లో ఆర్గుల నాగరాజారావుకు (1906) వాణిజ్య పారిశ్రామిక రంగాలలో విశేష ప్రతిభకుగా ‘పద్మ శ్రీ’ లభించింది. చక్కెర పరిశ్రమరంగంలో ఆయన ప్రతిభావంతులు. 1935లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నికయ్యారు. 1971 లో దేవన వెంకటరెడ్డికి పారిశ్రామిక రంగంలో ‘పద్మ శ్రీ’ లభించింది.
డా. కల్లం అంజిరెడ్డి (1941 ఆగస్టు – 2013 మార్చి):
ఔషధ పరిశ్రమలో భారతీయ ఘనతను వాటి చెప్పిన వ్యక్తి. 1984లో హైదరాబాదులో డా. రెడ్డీస్ లాబొరెటరీస్ స్థాపించారు. కార్పొరేట్ సామాజిక సంస్థ అయిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించారు. వీరికి 2001లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. ఆ తర్వాత 2011లో ‘పద్మ భూషణ్’ లభించింది.
నర్రా రవి కుమార్ (1963 సెప్టెంబరు):
సికింద్రాబాద్‌లో జన్మించారు. దళితుల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తున్నారు. న్యాయశాస్త్రంలో LLB, LLM చదివారు. దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని దక్షిణ దేశంలో స్థాపించారు. 40 మంది దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హైదరాబాదులో శిక్షణ ఏర్పాటు చేశారు. దళితుల కోసం శాంతిచక్ర ఫౌండేషన్ స్థాపించారు. 2014లో ‘పద్మ శ్రీ’ వరించింది. నేషనల్ టాస్క్‌ఫోర్స్ జాతీయ స్థాయి సభ్యులు రవికుమార్.
ఇంజనీరింగు నిపుణులు:
యమ్.వి. సీతారామశాస్త్రికి ఈ రంగంలో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. మహమ్మద్ ఫైజుద్దీన్ నిజామీ (సెప్టెంబర్ 1903-1977) కి 1977లో దక్కింది. హైదరాబాదులో జన్మించిన వీరు బొంబాయి ఆర్కిటెక్చర్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారు. హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరారు. రవీంద్రభారతి, సౌలర్‌జంగ్ మ్యూజియం భవన్, గాంధీభవన్ నిర్మాతగా ప్రసిద్ధులు.
రామ్ నారాయణ అగర్వాల్‌కు ‘పద్మ శ్రీ’ 1990లో; పద్మ భూషణ్ 2000లో లభించింది. అగ్నిక్షిపణి ప్రాజెక్ట్ తొలి డైరక్టర్. DRDO హైదరాబాదులో డైరక్టర్‌గా చేరారు.
బొంబాయిలోని BARC డైరక్టర్ గా, DRDO డైరక్టర్‌గా వ్యవహరించిన డా. జి. వెంకట్రామన్‌కు 1991లో ‘పద్మ శ్రీ’ లభించింది. వీరు పుట్టపర్తిలోని సత్యసాయి విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్‌గా విశేష కృషి చేశారు. ఆయన కర్మయోగి.
వ్యవసాయ రంగ నిపుణులు:
ఆంద్రప్రదేశ్‌కు చెందిన వ్యవసాయ రంగ నిపుణులలో యడ్లవల్లి వెంకట్రావు గుంటూరు జిల్లాలో జన్మించారు. వ్యవసాయ రంగంలోను ఉద్యానవన రంగంలోను నూతన పరిశోధనలు చేశారు. రైతునేస్తం, పశునేస్తం పత్రికలు స్థాపించారు. 2016లో రైతునేస్తం ఫౌండేషన్ నెలకొల్పారు. 2018లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు.
చింతల వెంకటరెడ్డి (1950 డిసెంబరు):
ఆల్వాల్ (హైదరాబాదు)లో జన్మించిన రైతు, వినూత్నంగా పంటలు పండించారు. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ వున్నారు. 2020 లో ‘పద్మ శ్రీ’కి ఎంపికయ్యారు.
~
నా పరిశోధనలో గత 44 వారాలుగా ‘భారత రత్న’ నుండి ‘పద్మ శ్రీ’ల వరకు అనేక మంది ప్రముఖులను స్మరించుకొనే అవకాశం సంచిక సంపాదక వర్గం – శ్రీ కస్తూరి మురళీకృష్ణ – సంయోజకులు శ్రీ కొల్లూరి సోమ శంకర్ కల్పించారు.
కొందరిని విస్మరించి వుండవచ్చు. అది నా లోపం. ఇది గ్రంథ రూపంలో వస్తే పలువురికి కరదీపిక కాగలదు.
స్వస్తి.
(సమాప్తం)
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.