సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    c v mohan rao

    ఇంత మండువేసవి లో చల్లని చిరుజల్లు సేదతీర్ప వచ్చినట్లుంది. రసభరితంగ వుంది. ఇల్లు వైకుంఠమందో చదువుతున్నప్పుడు అల వైకుంఠ పురంబులో పద్యం గుర్తు కొచ్చింది . వచనం గాని పద్యం గాని అద్భుతం. చాల చక్కగ అన్వయం కుదుర్తోంది All the best mm. మీలోనూ ఓ చిన్న వాల్మికీ ఓ చిన్న విశ్వనాధ వారూ తిష్ఠ వేశారనిపిస్తోంది

  2. 2

    మైథిలి అబ్బరాజు

    చాలా సంతోషమండీ !!
    ఎంత మాట…వారి దాసులకు దాసిని.

  3. 3

    కామేశ్వరరావు

    కల్పవృక్షంలోని పద్యాల పరిచయం చక్కగా సాగుతోందండి. ఇది ఇలాగే నిరాటంకంగా సాగి, మొత్తం ఆరుకాండలనూ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను.

    “యాగ సంరక్ష…” పద్యంలో మరొక విశేషం ఉంది. రామాయణ కథ మొత్తం ఆ పద్యంలో మనకి సూచనప్రాయంగా దర్శనమిస్తుంది.
    మొదటి పాదం రాముడు బ్రహ్మచారిగా విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయడాన్ని సూచిస్తోంది. రెండవ పాదం, ముని వేషధారియై తన రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళడాన్ని సూచిస్తోంది. మూడో పాదం “శివాకృతి” అయిన హనుమంతుని ఆదరించి, లంకేశ్వరుడైన రావణుని ఓడించడాన్ని సూచిస్తోంది. మహాలంకారి శబ్దాన్ని “మహా లంక అరి” అనికూడా విడగొట్టుకోవచ్చును – అంటే పెద్ద లంకకు శత్రువు అని. ధర్మము అంటే విల్లు అనే అర్థం కూడా వస్తుంది. నాల్గవ చరణంలో, ముని వేషాన్ని మాని తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టడమూ, రాజధర్మాన్ని పాటించడానికి సీతను పరిత్యజించడమూ ధ్వనిస్తున్నాయి.

    ఒక మనవి: ఇంత చక్కని వ్యాసపరంపరలో అచ్చుతప్పులు దిష్టిచుక్కల్లా కాక పంటి కింద రాళ్ళలా కాస్త ఎక్కువగా తగులుతున్నాయి. కబురందన జేసిరా – కబురందన్ జేసిరా
    మునుకూనలన్ – మునికూనలన్
    కందునా – కనుదునా
    ననుగొన్నను – కనుగొన్నను
    పొనర్చి – పొనర్చె

    ఇలా మరికొన్ని… వీటిని పరిష్కరిస్తే నిర్దుష్టంగా ఉంటుంది.

    ఒక సూచన: చదివే వాళ్ళ సులువుకోసం కొన్ని చోట్ల విసంధులు చేస్తున్నానని అన్నారు. అది మంచిదే. కానీ అది పద్య రూపంలో కాకుండా, మొదట పద్యం పద్యంగా యిచ్చి, కింద వచన వాక్యంలా దాన్ని చదువుకొనే వీలుగా విడగొట్టి ఇస్తే బాగుంటుంది. అప్పుడు పద్యం పద్యంలా చదువుకోవాలని అనుకొనే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు పద్యంలా పాదాలు విడగొట్టి యిస్తున్నా, కొన్ని చోట్ల పాదాలు విరుపు సరిగా ఉండటం లేదు. ఉదాహరణకు, “ఒక వంద వాలి” పద్యంలో రెండో పాదం – “పవనసుతుడు త” అన్న దగ్గర ఆగుతుంది. పద్యరూపంలో (పాదాలుగా) ప్రచురిస్తున్నప్పుడు, సరిగ్గా అలాగే ఇవ్వడం సమంజసం. లేదంటే వచనంలా వాక్యాలుగా యివ్వవచ్చు, అన్వయానికి సులువుగా.
    యిస్తున్న పద్యాలకు కాండ, ఖండం, పద్య సంఖ్య కూడా యిస్తే రిఫరెన్సుకు వీలుగా ఉంటుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!