తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్, సిల్వర్ జూబ్లీ ధ్యాన్ మహోత్సవ్ సందర్భంగా ఆనందోత్సాహాల ఘనమైన వేడుక.
‘హ్యాపీ థాట్స్’ అని ఆదరంగా పిలుచుకునే తేజ్ జ్ఞాన్ గ్లోబల్ ఫౌండేషన్ (TGF) తన రజతోత్సవ సంవత్సర వేడుకలను సగర్వంగా ప్రకటించింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా, ఫౌండేషన్ 25 సంవత్సరాలుగా ‘శాంతి, ఆనందం, ధ్యానం ద్వారా మానవ జీవితంలో కలిగే పరివర్తనా శక్తిని వ్యాప్తి చేయడానికి అంకితమైంది.
ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టానికి గుర్తుగా, తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ ధ్యాన మహోత్సవాన్ని ఆదివారం, 24 నవంబర్ 2024న K.L.N. ప్రసాద్ ఆడిటోరియం, హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు 125 నగరాలలో ఒకే రోజు నిర్వహించబడుతున్నాయి.
ఈ సమావేశంలో మోటివేషనల్ స్పీకర్, రచయిత, విద్యావేత్త, గౌరవనీయులు ఆకెళ్ల రాఘవేంద్ర, సంస్కార్ – ది లైఫ్ స్కూల్ వ్యవస్థాపకురాలు గౌరవనీయులు ఆలూరి మధుమతి, ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, వెల్లాల శ్రీకాంత్ విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్, విజనరీ స్థాపకులు సర్శ్రీ గురించి పరిచయం చేస్తారు. మానవులు ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఆధ్యాత్మికత మరియు ధ్యానం యొక్క లోతైన ప్రభావాన్ని బలంగా వ్యాప్తి చేయడం చేయడం ద్వారా లక్షల మందికి మందికి స్ఫూర్తినిచ్చి, వారి జీవితాలలో పరివర్తన తీసుకువచ్చారు, స్పిరిచువల్ గురు, తేజగురు సర్ శ్రీ.
సమావేశ వివరాలు:
తేదీ: ఆదివారం, 24 నవంబర్ 2024
సమయం: సాయంత్రం 6:00 నుండి రాత్రి 8:00 వరకు
స్థలం: కె.ఎల్.ఎన్. ప్రసాద్ ఆడిటోరియం, FTCCI, ఫెడరేషన్ హౌస్, 11-6-841, FAPCCI మార్గ్, రెడ్ హిల్స్, హైదరాబాద్
ధ్యాన ఔత్సాహికులకూ, ఆధ్యాత్మిక అన్వేషకులకు ఇంకా పౌరులందరికీ సిల్వర్ జూబ్లీ ధ్యాన్ మహోత్సవమునకు TGF హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొని అంతర్గత శాంతి బహుమతిగా స్వీకరించండి. ఈ వేడుకలలో తేజ్ గురు సర్శ్రీ గారి జ్ఞాన, అనుభవ ప్రవచనాల ద్వారా హాజరైన వారందరి జీవితాన్ని సుసంపన్నం చేసే అనుభూతిని కలిగిస్తుంది.
ఆహ్వానం:
ధ్యానం యొక్క పరివర్తనా శక్తిని అన్వేషించడానికి, మీ జీవితంలో ఆనందం మరియు సామరస్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేయడానికి మాతో చేతులు కలపండి.
25 సంవత్సరాల ‘హ్యాపీ థాట్స్’ సంబరాలను జరుపుకోవడానికీ, ఆధ్యాత్మిక మేల్కొలుపుకు సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభించడానికి కలిసి రండి. ధన్యవాదములు
వివరాలకు సంప్రదించండి:
Ph No: 9849377755, 9177760770
వెబ్సైట్: www.happythoughts.global
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.