Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తేదీ

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘తేదీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మారుతున్న కాలగతి
తారుమారు కాకపోవచ్చు
ఎల్లకాలం గుర్తుండడానికి
తేదీ విఖ్యాతమై ఉంటుంది

జననానికి మరణానికి
విధి విరచితం కావచ్చు
మధ్యలో పెళ్ళిక్కూడా
తేదీ కల్పితమై ఉంటుంది

ప్రాముఖ్యత ప్రాధాన్యత
ఏ విశేషమైన ఉండవచ్చు
విషయ వివరణ కోసం
తేదీ లిఖితమై ఉంటుంది

సంఘటనైన దుర్ఘటనైన
భారీవిపత్తు జరుగవచ్చు
లోకానికి తెలియడానికి
తేదీ ముద్రితమై ఉంటుంది

గడువుతో అక్కర్లేకుండానే
శూన్యంలోకి జారిపోవచ్చు
చేజారిన సుందరశిల్పంపై
తేదీ నిహితమై ఉంటుంది

Exit mobile version