[సామల కిరణ్ గారు రచించిన ‘తస్మాత్ జాగ్రత్త’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అడుగడుగున
ఆంగ్ల మానసపుత్రులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
మెకాలే భావ దరిద్రులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
అంధ మతోన్మాదులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
విద్వేషపు కవులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
విదేశీ పైత్యకారులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
విచిత్ర వేషగాళ్లున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
విభజనకారులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
దేశాన్ని తిట్టెటోళ్ళున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
అర్బన్ నక్సల్స్ ఉన్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
సంస్కృతి వ్యతిరేకులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
ఆర్భాటకులు ఉన్నారు
తస్మాత్ జాగ్రత్త..
అడుగడుగున
రాక్షస వారసులున్నారు
తస్మాత్ జాగ్రత్త..
సామల కిరణ్ కరీంనగర్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు, కవిత్వంపై ఆసక్తి మెండు.