[డా. సి. భవానీదేవి రచించిన ‘తప్పిపోయిన తేదీలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అమ్మలో రూపుదిద్దుకున్నప్పటినుండి రూపమేలేని నా లేత శరీరమంతా అల్లుకున్న కాలవృక్షం క్షణక్షణం రేకులు రాలుస్తూనే ఉంది ఘడియలు.. నిమిషాలు.. గంటలు.. సంవత్సరాలు నరనరంలో అనూహ్య సంచలిత చిత్రాలు
నేను ఎదుగుతున్నకొద్దీ అమ్మ.. నాన్నల రూపురేఖలు మారిపోయాయి వాళ్ళ చూపు, మాట, నడక వయస్సును పెంచుకుంటూ వృద్ధాప్యాన్ని ధరించింది పండిపోయిన జుట్టంతా సుఖదుఃఖాల పడుగుపేకలు ఆ వటవృక్షాల నీడలోనే మేమంతా
ఒక వికృతరాత్రి పెద్దతుఫాను రాబందు నాన్న శరీరాన్ని ఎగదన్నుకుపోయింది ఆయన కళ్ళుమాత్రం నాలోనే ఇంకిపోయాయి ఒక నిరంకుశపు దురహంకారం అమ్మ మమకారాన్ని మాయంచేసింది
అమ్మ చేతులు మాత్రం కట్టెల్లో కాలిపోకుండా నావైపే చాపి పిలుస్తూనే ఉన్నాయి వాళ్ళ నీడలో హాయిగా ఉన్నవాళ్ళమంతా ఎవరెవరం ఏ తేదీల్లోకి తప్పిపోయామో.. మనసుమాటల్ని మరిచిపోయి మొహాలపై నవ్వురంగుతో తిరుగుతున్నాం నేను మాత్రం పెద్ద – చిన్న ముళ్లసంకెళ్ళలో నిస్సహాయంగా.. నిరంతర బందీగా!
ఎదలోపలి దుఃఖ సంద్రాన్ని సరళమైన మాటల్లో చెప్పారు భవాని గారు. మంచి కవిత!తోడబుట్టిన వాళ్లే తప్పిపోయి నిశ్చింతగా ఉంటున్నారు. మనసున్న వాళ్ళు మాత్రం ముళ్ళసంకెళ్ల బందీలుగా బాధ పడుతున్నారు.నిజం!అభినందనలు మీకు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఎంతెంత దూరం
పిచ్చి వనం
ఎగిరే గాలిపటం
సంభాషణం: ‘కార్టూన్ – కథా విరించి శ్రీ సరసి’ అంతరంగ ఆవిష్కరణ
కష్టజీవి
కలకాలం నిలువదా
కాంచన శిఖరం-4
జీవన సౌరభం
సరిగ్గా వ్రాద్దామా?-8
Thank You very much for your affectionate Words.
Thank You very much.
మీ అమూల్య స్పందనకు ధన్యవాదములు రఘునాథ్ గారు.
Thank You very much for your great and inspiring words.
Thank You.
All rights reserved - Sanchika®