Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-93

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ఆత్మవాన్ కృతిః

భీష్మ ఉవాచ:
ఇతి మతిరుపకల్పితా వితృష్ణా
భగవతి సాత్వతపుంగవే విభూమ్ని|

స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం
ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః॥1॥

త్రిభువనకమనం తమాలవర్ణం
రవికరగౌరవరాంబరం దధానే|

వపురలకకులావృతాననాబ్జం
విజయసఖే రతిరస్తు మేఽనవద్యా॥2॥

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్
కచలులితశ్రమవార్యలంకృతాస్యే|

మమ నిశితశరైర్విభిద్యమాన
త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా॥3॥

సపది సఖివచో నిశమ్య మధ్యే
నిజపరయోర్బలయో రథం నివేశ్య|

స్థితవతి పరసైనికాయురక్ష్ణా
హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు॥4॥

వ్యవహిత పృథనాముఖం నిరీక్ష్య
స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా|

కుమతిమహరదాత్మవిద్యయా య-
-శ్చరణరతిః పరమస్య తస్య మేఽస్తు॥5॥

స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞాం
ఋతమధికర్తుమవప్లుతో రథస్థః|

ధృతరథచరణోఽభ్యయాచ్చలద్గుః
హరిరివ హంతుమిభం గతోత్తరీయః॥6॥

శితవిశిఖహతో విశీర్ణదంశః
క్షతజపరిప్లుత ఆతతాయినో మే|

ప్రసభమభిససార మద్వధార్థం
స భవతు మే భగవాన్ గతిర్ముకుందః॥7॥

విజయరథకుటుంబ ఆత్తతోత్రే
ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే|

భగవతి రతిరస్తు మే ముమూర్షోః
యమిహ నిరీక్ష్య హతాః గతాః సరూపమ్॥8॥

లలిత గతి విలాస వల్గుహాస
ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః|

కృతమనుకృతవత్య ఉన్మదాంధాః
ప్రకృతిమగన్ కిల యస్య గోపవధ్వః ॥9॥

మునిగణనృపవర్యసంకులేఽన్తః
సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్|
అర్హణముపపేద ఈక్షణీయో
మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా ॥10॥

తమిమమహమజం శరీరభాజాం
హృది హృది ధిష్టితమాత్మకల్పితానామ్ |

ప్రతిదృశమివ నైకధాఽర్కమేకం
సమధిగతోఽస్మి విధూతభేదమోహః ॥11॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ప్రథమస్కంధే నవమోఽధ్యాయే భీష్మకృత భగవత్ స్తుతిః |

మహాభారతంలో భీష్ముని పేరు వినగానే నీతి, నిష్ఠ, అనంతమైన ధైర్యం, ఆచరణ, కఠినమైన కట్టుబాట్లు ఇలా అనేక గుణాలకు తనను నిదర్శనంగా నిలుస్తాడు ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భీష్ముడు ధర్మాన్ని ఆచరించేవాడు. శాస్త్రవిహితమైన సంధ్యా వందనం, సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేవాడు కాదు. యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి, సూర్య ఉపాసన చేసి, తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధభూమిలోనే ఇసుకతోనే ఆర్ఘ్య ప్రదానం చేసేవాడు. అందుకే ఆయనను ధర్మానికి ప్రతీకగా పరిగణిస్తారు.

తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, ఆ చేసిన ప్రమాణాన్ని, తన తుది శ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు. తన సోదరుల మరణం తర్వాత, తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీ దేవి స్వయంగా ఆదేశించినా ప్రతిజ్ఞా భంగం చేయడానికి ఏ మాత్రం అంగీకరించలేదు.

ఇది ఆయన జీవితంలో చేసిన మొదటి ఘోరమైన తప్పు.

ఎందుకు?

దానికన్నా ముందు కొన్ని విషయాలు నెమరు వేసుకుందాం.

భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ఠ, రాజభక్తి వంటి లక్షణాలు అన్నీ ఉన్నాయని అందరికీ తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భీష్ముడు శ్రీకృష్ణునికి గొప్ప భక్తుడు. అయితే భీష్ముడు అందరి మాదిరిగా తన కృష్ణభక్తిని ఎక్కడా బయటకు చెప్పలేదు. చాలాకాలం వరకూ. దానికి కారణం ఉంది. దాని గురించి కూడా తెలుసుకోవాలి. కుందాము.

అంపశయ్యపై ఉన్నప్పుడు యుధిష్టరునికి దౌత్యం, పాలక బాధ్యతల గురించి లోతైన, ముఖ్యమైన విషయాలను, విలువల గురించి వివరించాడు. ఆ సమయంలో చెప్పినదే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం. దాని వ్యాఖ్యానమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది త్రిమత వ్యాఖ్య.

ఇంతకీ ఈ త్రిమత వ్యాఖ్య ఎందుకు? ఎందరో పెద్దలు రకరకాల వ్యాఖ్యానాలు, వివరణలు ఇచ్చారు. మరి ఈ వ్యాఖ్య ప్రత్యేకంగా ఎందుకు? అసలు ఇన్ని వ్యాఖ్యలు ఎందుకు?

దానికి సమాధానాన్ని మనం నాలుగవ ఎపిసోడ్ లో కొంత చూశాము.

ఈ మూడు వ్యాఖ్యలు

  1. శంకర వ్యాఖ్య అనబడే అద్వైత వ్యాఖ్య.
  2. ద్వైత వ్యాఖ్యానం సత్యసంథ తీర్థులు అందించారు.
  3. ఇక రామానుజ విశిష్టాద్వైతం ఆధారంగా వచ్చిన భగవద్గుణ దర్పణం అనబడే పరాశర భట్టర్ వ్యాఖ్య.

వీటిలో ద్వైత వ్యాఖ్య చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటి గురించి మనం మూడవ ఎపిసోడ్ లో తరచి చూశాము. దామోదర లీల – ద్వైతలోపం.

అహంకారము, మమకారము. ఈ రెండూ ద్వైతాన్ని ఆచరించేవారిని అడ్డగిస్తుంటాయి. దేవుడు వేరు, నేను వేరు. ఇదీ వారు పద్ధతి. ఇది నిజానికి దాసభక్తిగా చెప్పినప్పటికీ, ఎందుకు అహంకారం మమకారాలు వచ్చి చేరాయి? నేను వేరు, దేవుడు వేరు (జీవాత్మ వేరు, పరమాత్మ వేరు) అనే వారి భావనలో నేను అనే భావన ప్రత్యేకంగా, ప్రధానంగా కూడా కానవస్తుంది. అది సాత్వికమైనదైనా అహం అహమే! దానిని కూడా వదిలించుకోవాలి.

ఇక అద్వైతంలో అందరికీ బాగా తెలసిన అహం బ్రహ్మాస్మి కూడా సూక్ష్మ లోపంతో ఉన్నదని, విశిష్టాద్వైతం వచ్చింది.

But Vishishta Advaita allows and calls for revisionism. As Bhagawad Ramanuja stated, surface level philosophy should be revisioned every few centuries as Dharma should evolve with place, time and situation.

ఈ రివిజనిజమ్ అన్నది అవసరం కనుకనే రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో ఉన్న సత్తాను బట్టీ, భక్తిని బట్టీ నిలిచాయి. ఇతరాలు కనుమరుగయ్యాయి.

ఈ విషయం సరే!

మరి భగవానుడు ఏ వ్యాఖ్యను, మతాన్ని అంగీకరిస్తాడు?

దానికి సమాధానం వచ్చే వారం. సవివరంగా చూద్దాము.

(సశేషం)

Exit mobile version