[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
మాధవమ్ మధుసూదనమ్-1
ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తై-
-ర్దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ।
ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ
జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ॥18॥
యం ధర్మకామార్థవిముక్తికామా
భజంత ఇష్టాంగతిమాప్నువంతి।
కిం చాశిషో రాత్యపి దేహమవ్యయం
కరోతు మేఽదభ్రదయో విమోక్షణమ్॥19॥
ఏకాంతినో యస్య న కంచనార్థం
వాంఛంతి యే వై భగవత్ప్రపన్నాః।
అత్యద్భుతం తచ్చరితం సుమంగలం
గాయంత ఆనందసముద్రమగ్నాః॥20॥
తమక్షరం బ్రహ్మ పరం పరేశ-
-మవ్యక్తమాధ్యాత్మికయోగ గమ్యమ్।
అతీంద్రియం సూక్ష్మమివాతిదూర-
-మనంతమాద్యం పరిపూర్ణమీడే॥21॥
యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః।
నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః॥23॥
యథార్చిషోఽగ్నేః సవితుర్గభస్తయో
నిర్యాంతి సంయాత్యసకృత్స్వరోచిషః।
తథా యతోఽయం గుణసంప్రవాహో
బుద్ధిర్మనః ఖాని శరీరవర్గాః॥23॥
(గజేంద్ర మోక్షం నుంచీ గజేంద్రుడు అందించిన స్తుతి – కొనసాగింపు)
ఇప్పుడు సత్యసంధ తీర్థులవారి ద్వైత వ్యాక్య చూద్దాము
॥స్వరాదిత్వాదవ్యయాత్మకఋశబ్దవాచ్యస్వర్గే భాంతీతి ఋభః – దేవాః, భువం గచ్ఛంతీతి భూగాః ఋభా యస్మాత్స భూగర్భః॥ – ఋ శబ్దం వాచ్య స్వర్గంలో ప్రకాశించే దేవతలు ఎవరి ఆజ్ఞ వల్ల భూమికి వచ్చినారో అతడు భూగర్భుడు (భూగా + ఋభాః)
॥ఋశబ్దవాచ్యః స్వర్గః అదితిర్వా సర్వాదిపాటాదవ్యయత్వమ్॥ (అమరం, మొదటి కాండ).
అవతారాలు.. శ్రీరామ, శ్రీకృష్ణ వచ్చినప్పుడు ఇతర దేవతలు శ్రీహరి ఆజ్ఞ మీద వివిధ రూపాలలో భూలోకమున జన్మించుట పురాణేతిహాస ప్రసిద్ధము. అమరకోశమున ఋశబ్దము స్వర్గ వాచకముగా చెప్పబడినది.
॥భూః గర్భా యస్యేతి వా॥ – ఎవని యొక్క గర్భమున భూమి యున్నది అతడు భూగర్భుడు.
భూమి ఎవని గర్భమునుండి రక్యణ పొందుతున్నదో! అన్న దానిని శంకరాచార్యులు కూడా చెప్పారు.
మిగిలిన శంకర వ్యాఖ్య చూద్దాము.
ఈ విశ్వమంతా భగవానుని నుంచీ ఆవిర్భవించింది. ఆయన యందు స్థిరమైన ఉండి, ఆయన యందు అగుపించుచున్నది.
We cannot escape the universe. We’re in the universe. Only when we under-stand without any doubt that we’re the universe, we will be independent of it. Reason: We become Him. Who is independent of everything. Hence we shall be independent in that sense.
అహం బ్రహ్మాస్మి!
భూమి (అనేక విశ్వాలలో ఉన్న – ఆ యా విశ్వాలలో ఉన్న ఏకైక భూములు) మీద ఉన్న సకల జీవులను గర్భంలో ఉన్న బిడ్డను తల్లి రక్షించినట్లు రక్షించు వాడు భూగర్భుడు.
మరి ఇదంతా చేయటానికి అంతులేని ఐశ్వర్యము కావాలి. ఆయన దానికి అధిపతి. అందుకే ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి భర్త అయి ఉంటాడు.
రాబోయే నామం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది.
ఇక పరాశర భట్టర్ వ్యాఖ్య చూద్దాము.
॥హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ॥
హ్రీః అనగా భూమి.
శ్రీదేవి, భూదేవులకు పతి.
భూదేవిని.. స్త్రీ తన గర్భంలో ఉన్న శిశువును చూసుకొనునట్లు చూసుకుంటాడు. అంటే జాగ్రత్తగా కాపాడతాడు.
73. మాధవః – మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త.
ఇన్దిరా లోకమాతా మా రమా మఙ్గళదేవతా అని లక్ష్మీదేవికి నామాంతరాలు.
కనుక – మా అంటే లక్ష్మీదేవి. ధవః అంటే పతి.
అంటే లక్ష్మీపతి. ఇది పరాశర భట్టర్ చెప్పిన మాట కూడా.
శంకరాచార్యులు చెప్పిన భాష్యములో ఇదే విషయం స్పష్టపరచారు. ఆ పైన మధువిద్యచే ఎరుగతగిన వాడు అని చెప్పారు.
మధు అనే రాక్షసుని సంహరించిన వాడు అని కూడా చెప్పబడింది. అది మధుసూదన దగ్గర చూద్దాము.
మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు.
సకల విద్యా జ్ఞానములకు ప్రభువు.
పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు. ఆయన గురించి ఆయనకు తప్ప వేరొకరికి ఎలా తెలుస్తుంది?
మధు (యాదవ) వంశమున పుట్టినవాడు.
తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు).
మా అంటే వ్యతిరేకార్థము అని కూడా ఉంది కదా! అంటే అసలు తనకు పతి లేని వాడు. లేదా తన మీద అధికారిగా వేరొకరు లేనివాడు.
మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
ఇప్పుడు ఆయన లక్ష్మీదేవికి పతి ఎలా అయ్యాడు అన్న విషయమును శ్రీమద్భాగవతము ఆధారముగా చూద్దాము.
ततश्चाविरभूत् साक्षाच्छ्री रमा भगवत्परा।
रञ्जयन्ती दिशः कान्त्या विद्युत् सौदामनी यथा ॥८॥
తతశ్చావిర్భూత్ సాక్షాచ్ఛ్రీ రమా భగవత్పరా।
రఞ్జయన్తీ దిశః కాన్త్యా విద్యుత్ సౌదామినీ యథా॥8.8.8॥
అప్పుడు ఆవిర్భవించినది!
అమ్మ!
రమా అన్న పేరు కలిగినది.
ఐశ్వర్యమునకు ప్రతిరూపము. దానిని అదుపులో ఉంచుకున్న జనని.
ఆవిడ ఒక విద్యుల్లత ఎలా కనిపిస్తుందో ఆకాశంలో అదే విధంగా లిప్తపాటు కాలంలో ఆవిర్భవించింది. ఆమె ఎంత తేజస్సుతో ప్రకాశిస్తోందంటే ఆమె నుంచీ వస్తున్న వెలుగులు అన్ని దిశలలో వ్యాపించాయి.
ఇక్కడ వ్యాస మహర్షి చమత్కారం, ప్రణాళిక చూడాలి.
ఎనిమిదవ స్కంధము.
ఎనిమిదవ అధ్యాయము.
ఎనిమిదవ శ్లోకము.
8+8+8 = 24.
గాయత్రీ మంత్రములో అక్షరాలు.
శ్రీమన్నారాయణుడు గాయత్రీ మంత్రము ప్రతిపాదించిన పరతత్వం. అందుకే అమ్మ శ్రీహరిని వరించింది.
ఇంకొక చమత్కారము.
అష్టమావతారమైన (?), అష్టమ గర్భంలో వశించిన, అష్టమి నాడు జన్మించిన శ్రీకృష్ణుని రుక్మిణిగా వరించి మరీ ఆయన వద్దకు చేరింది.
8 8 8.
అక్కడా, ఇక్కడా లక్ష్మీదేవి (రుక్మిణి) వరించినది ఆ నీలమేఘశ్యాముని.
ఒక్క రామావతారములో మాత్రమే..!
అందుకే ఆకాశంలో విద్యుత్ సౌదామినీ యథా అని వ్యాస భగవానుడు పోలిక చూపాడు. ఎలా అయితే నల్లని ఆకాశంలో విద్యుత్ పుంజము లేదా మెరుపు స్పష్టంగా అగుపిస్తుందో, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ శక్తి వికసించేది శ్రీమన్నారాయణుని చెంతనే. అంటే ఇష్టపూర్వకంగా తనదైన స్థితిలో ఉండునది అని భావము. ఆమె ఆ కారణము చేతనే నిత్యానపాయని అని పిలువబడింది.
ఆమె క్షేత్రము. ఆయన బీజము.
This can be explored as the manifestation of electric field. Or as we discussed previously, electromagnetic field. అంటే కేవల సాకార రూపముగా గ్రహించాలి.
లక్ష్మీదేవి శ్రీహరి యొక్క చైతన్యశక్తి అని గతంలో చూసాము (45-47 ఎపిసోడ్లు).
సందర్భం వచ్చింది కనుక ఇక్కడ కూర్మావతార ఘట్టాన్ని కూడా ఒకసారి తలచుకుందాము. ఇక్కడ చాలా విశేషాలు తెలుస్తాయి.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య