[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
కదాచిత్-కాలిందీ తటవిపిన సంగీతకరవో
ముదాభీరీ నారీవదన కమలాస్వాదమధుపః ।
రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే ।
సదా శ్రీమద్వృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు నే ॥ 2 ॥
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాంతస్సహజ బలభద్రేణ బలినా ।
సుభద్రా మధ్యస్థస్సకలసుర సేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 3 ॥
(శ్రీ శంకరాచార్య విరచిత జగన్నాథాష్టకమ్)
69.ప్రాణః
శంకరాద్వైతం ప్రకారం ప్రాణశక్తి స్వరూపుడైన విష్ణుమూర్తి పేరాణః అని పిలువబడినాడు. ప్రాణము కలిగినది ప్రాణి. కనుక ప్రతి ప్రాణియందు భగవానుడు లేదా ఆ విశ్వశక్తి ఉంది. ప్రతిజీవిలో ఉచ్ఛావాస నిశ్శ్వాసలు తన వలన మాత్రమే జరుగుతున్నవి. అందుకే భగవానుని
॥ప్రాణస్య ప్రాణః॥ – ప్రాణులకు/ప్రాణమునకు ప్రాణము భగవంతుడు.
ఈ విషయం బృహదారణ్యకోపనిషత్ లోనిది. అనగా ముఖ్య ప్రాణము అనుకోవచ్చు.
కనుక ప్రాణులు నూతనముగా జన్మించుచున్నను ప్రాణమునకు ప్రాణమై భాసిల్లు తాను నూతనమైనవాడు కాదు. ఈ విషయం తరువాత వచ్చే నామము తెలియజేస్తున్నది.
జీవించువాడు, పరమాత్మ అనే అర్థాలను కూడా స్వీకరించవచ్చు అని పెద్దలు తెలిపారు.
ఇక సత్యసంధ తీర్థుల వారి మాట ఏమిటో చూద్దాము.
॥ప్రకృత్వచేష్టకత్వాత్ వా – ప్రాణః (ప్ర + అనః)॥ – ప్రకృష్టమైన చేష్టలు కలవాడు.
దీని తరువాత వచ్చే నామాన్ని శంకరాచార్యులు జ్యేష్టః అని తీసుకోగా సత్యసంధ తీర్థులు జ్యేష్ఠ శ్రేష్ఠః అని తీసుకున్నారు. పరాశరభట్టర్ కూడా శంకరుల మాదిరిగానే జ్యేష్ఠః అని తీసుకున్నారు.
ముందు ప్రాణః అనే నామానికి భట్టరు వారి వ్యాఖ్య చూద్దాము.
॥ప్రాణః – ప్రాణికి అనేన ఇతి ప్రాణః॥ – జీవులకు జీవులు బ్రతికి ఉండే కారణమైన ప్రాణముగా ఉండువాడు.
॥దేవానాం నిరవర్తతానురేకః॥ – దేవతలందరినీ తానొక్కడే ప్రాణము వలె బ్రతికించి ఉండువాడు. ఇందువల్ల భగవానుడే ప్రాణము.
ప్రాణః అనే ప్రాణ శబ్దము వలన గాయత్రీమంత్రములో చెప్పబడుతున్న పరబ్రహ్మ సూచిక. గయాన్ అనగా ప్రాణులను, త్రాయతే ఇతి గాయత్రి. పంచప్రాణములను ఎవరు రక్షించుకోవాలి అట్టి పరమాత్మయే (భర్గోదేవస్య) గాయత్రీ స్వరూపుడు. విశ్ములోని సమస్త లోకములలో చరించునదే ప్రాణము.
మోక్షమును పొందుటకు పూర్వము సాధనను, కర్మను బట్టి విశ్ములో ఉన్న అనేక లోకములలో ఈ జీవులు జన్మలను తీసుకుంటాయి.
మానవ జన్మ రాక మునుపు 84 లక్షల జీవరాశులలో ఏదైనా ఆ జీవికి ఉపాధి కావచ్చు. ఆ పైన మానవ జన్మ వచ్చినా మరి ఎన్ని జన్మలకు ఎన్ని లోకాలను (భువర్లోక, సువర్లోక..) దాట వలెనో పరమాత్మ అనుగ్రహం పొందేందుకు.
ఈ విషయాన్ని మరింత విస్తారంగా చూడాలి.
అలెగ్జాండర్ ఒపారిన్ రాసిన ‘ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్’ పుస్తకం భూమిపై జీవం ఎలా ఉద్భవించి ఉండవచ్చు అనే ఆసక్తికరమైన పరికల్పనను లోతుగా పరిశీలిస్తుంది. భూమి యొక్క ప్రారంభ దశలో మహాసముద్రాలు వాటి ఆదిమ రూపంలో ఉంటాయి. ఆ ఆదిమ సముద్రాల primordial soup లో జరిగిన అనేక రసాయన చర్యలే తదుపరి ప్రాణుల ఆవిర్భావానికి కారణమని అతను ప్రతిపాదించాడు.
అతని పరికల్పన ప్రకారం, ఆదిమ వాతావరణంలో ఉన్న కర్బనేతర అణువుల (inorganic matter) నుండి సాధారణ సేంద్రీయ సమ్మేళనాలు ఏర్పడ్డాయి. ఈ సేంద్రీయ సమ్మేళనాలు, కాలక్రమేణా, కలిసిపోయి మరింత రసాయన ప్రతిచర్యలకు గురై మరింత సంక్లిష్టమైన అణువులను ఏర్పరుస్తాయి. చివరికి, ఈ సంక్లిష్ట అణువులు తమను తాము మొదటి సాధారణ జీవులుగా వ్యవస్థీకరించుకున్నాయి.
మన వేదాలు, ఇతర శాస్త్రాలు చర, అచర జీవులన్నిటిలో ప్రాణశక్తి నిక్షిప్తమై ఉంటుందని తెలిపాయి. అలాగే వాటన్నిటినీ మూలముగా ఉండే అణువులు, కణాలు అన్నిటిలో రసాయన చర్యలు జరుగుతాయి. పరమాణువుల కన్నా జీవ కణాలు మరింత సంక్లిష్టమైనవి. కారణం మానవ, ఇతర జీవ దారాల కణాలలో అనేక అణువులు ఉంటాయి. అణువలన్నీ పరమాణువులతో నిర్మితమైనవే. ఇవన్నీ రసాయన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం.
Oparin’s work is significant because it proposed a scientific and testable framework for understanding the origin of life, moving away from purely speculative or supernatural explanations.
His ideas provided a foundation for the field of abiogenesis, which studies how life can arise from non-living matter. Oparin’s hypothesis also influenced future research in biochemistry and molecular biology, leading scientists to explore the potential pathways and conditions that could have led to the emergence of life on Earth.
ఒపారిన్ పరిశోధనలు సైన్స్ లోని అత్యంత లోతైన ప్రశ్నలలో ఒకదానికి బలమైన వివరణను అందించే ఒక మైలురాయి వంటివి. జీవ మూలాల అధ్యయనంలో ఒక మూలస్తంభంగా నిలిచి, ఈ రంగంలో నిరంతర అన్వేషణ మరియు ప్రయోగాలకు ప్రేరణనిస్తుంది.
ఇక్కడ కణాలు, అణువులు వీటి గురించి లోతుగా తెలుసుకుంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలుతుంది.
నిజానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా చూస్తే భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతి చర్యకు హేతువు ఉంటుంది. ఆ హేతువు దొరికినంత మాత్రాన దైవీశక్తి లేదని కాదు. గత ఎపిసోడ్లో చూసిన విధంగా విశ్వ చరిత్రలో ముందుగా ఉత్పత్తి చేయబడిన మూలకాలు అతి తక్కువ జీవిత కాలం కలిగి ఉండి తరువాత అదృశ్యం అయి ఉండవచ్చు. అలాగే మనకు అంతుబట్టని అనేక శక్తులు అదృశ్య రూపంలో ఉండవచ్చు. వాటి సంగతి తేల్చాలి కదా.
చూద్దాము.
మానవ/జీవ కణ నిర్మాణము ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాము.
జీవకణం జీవులన్నిటిలో మూలాధారమైన ప్రాణశక్తి. ప్రతి జీవకణం త్వచం (ఒకరకమైన పొర) తో కప్పబడి ఉండే సైటోప్లాజంతో నిండిఉంటుంది. ఈ పొరలో ప్రోటీన్లు, కేంద్రకామ్లాల వంటి జీవాణువులు అనేకం ఉంటాయి.
దీనికి సంబంధించి కాలక్రమంలో జరిగిన పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1632 – 1723: ఆంథోని వాన్ లీవెన్హక్ కటకాలు ఉపయోగించి ఒక సూక్ష్మదర్శిని తయారుచేసుకొని వర్షపు నీటిలో ఉండే వొర్టిసెల్లా అనే ప్రోటోజోవా జీవినీ, తన నోటిలో సూక్ష్మక్రిములను చూసి, వాటి బొమ్మలు గీశాడు.
1665: రాబర్ట్ హుక్ కణాలను బిరడా, మొక్కలలో గుర్తించాడు.
1839: థియోడార్ ష్వాన్, మథయాస్ జాకబ్ ష్లీడెన్ మొక్కలు, జంతువులన్నీ కణాలతో నిర్మించడ్డాయని గుర్తించారు. ఇదే కణ జీవశాస్త్రానికి మూలం.
రుడాల్ఫ్ విర్కో కణ విభజన ద్వారా మాత్రమే కొత్త కణాలు తయారవుతాయని గుర్తించాడు.
1935 నాటికి ఎర్నెస్ట్ రస్క్ కాంతిని ఉపయోగించుకొనే సూక్ష్మదర్శిని కన్నా రెండు రెట్లు శక్తివంతమైన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తయారుచేశాడు. దాని వలన అప్పటిదాకా తెలియని కణాంతర్గత నిర్మాణాల గురించి తెలుసుకోవడం సాధ్యమైంది.
1953: జేమ్స్ డి.వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ డి.ఎన్.ఎ. యొక్క నిర్మాణాన్ని ప్రకటించారు.
1981: లిన్ మార్గులిస్ Lynn Margulis ఎండోసింబయాటిక్ సిద్ధాంతాన్ని Endosymbiotic theory ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం, బాక్టీరియా వంటి ఏకకణ జీవులే కణాంతర్గత నిర్మాణాలుగా ఏర్పడ్డాయి. దాని గురించిSymbiosis in Cell Evolution అనే పరిశోధన పత్రంలో ప్రచురించాడు.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂 తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు. గీతాచార్య
నమస్సులు
You must be logged in to post a comment.
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-3
ఆరోహణ-9
మానస సంచరరే-20: మూగవైన ఏమిలే.. గుణములోన మిన్నలే!
అమ్మ గుర్తుకొస్తోంది
నా సరికొత్త బాల్యం
అమ్మ చీర కొంగు
లేడీ ఆఫ్ ఖయల్ – గంగూబాయి హంగల్
ఎంత చేరువో అంత దూరము-14
చిత్రగుప్తుడి నోము
ఆత్మ స్వరూపం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®