Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లిదండ్రులు మొగ్గలు

కంటికి రెప్పలా నిత్యం కాపాడుతూనే
వసుధైక కుటుంబాన్ని ఏర్పరుస్తారు
ఇలలో పూజించే దేవతలు తల్లిదండ్రులు

సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తూనే
బంధాలకు గట్టి పునాదులు వేస్తారు
ప్రేమకు ప్రతిరూపాలు తల్లిదండ్రులు

క్షణం తీరికలేక బాధ్యతలను నిర్వహిస్తూనే
సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు
భవిష్యత్‌కు పునాదులు తల్లిదండ్రులు

మంచి నడవడికను పెంచుతూనే
ప్రేమానురాగాలను పంచుతుంటారు
సభ్యత, సంస్కారాలకు దిక్సూచి తల్లిదండ్రులు

Exit mobile version