Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తలపుల తలుపులు

[వాణి వేమవరపు గారు రచించిన ‘తలపుల తలుపులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

తం తలపుల తలుపులు ఓరగ దీసాను,
అమ్మ ఆలనా, నాన్న పాలన కనిపించాయి,
సహోదరులతో హాస్యఛలోక్తులు,
తోబుట్టువులతో గిల్లికజ్జాలు,
బంధం తప్ప బరువు బాధ్యతలు లేవు,
ప్రేమ ఆప్యాయతలు తప్ప కల్మషాలు లేవు,
తిరిగిరాని ఆ రోజుల కోసం వెతికాను,
మరపురాని ఆటలు, పాటలు అగుపడ్డాయి,
ఏవీ, ఎక్కడ ఉన్నాయి ఆ రోజులు?,
ఆ కాలం దగ్గరికి రానంటోంది,
దోబూచులాడుతూ ఎక్కడో దాక్కుంది.
బాధగా, బరువుగా తలపుల గది
తలుపులు వేయడానికి ప్రయత్నిస్తున్న,
బాల్య గురుతులు చూస్తూ
ప్రస్తుతంలో మౌనంగా ఉండిపోతున్నా.

Exit mobile version