Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ వేంకటేశ్వర వైభవం

[వి. శ్రీలక్ష్మి గారి ‘శ్రీ వేంకటేశ్వర వైభవం’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

1.
దర్శనం వేరు అయినా దైవం ఒక్కటే
అవతారాలు వేరు అయినా ఆత్మ ఒక్కటే
రూపం వేరు అయినా నీ అనుగ్రహం ఒక్కటే
అందరి నోటా నీ నామస్మరణ ఒక్కటే
ముచ్చటగా ఆ నామమే ఓం నమో వేంకటేశాయ!!

2.
ఓ శ్రీనివాసా
ఈ సర్వ జగత్తులో నీ నామం స్మరింపని వారు లేరు
ఈ కలియుగ ప్రత్యక్ష దైవమా నిన్ను దర్శించని దేహమే లేదు
చంద్రబింబం లాంటి నీ ముఖపద్మము చూసి పులకించే నా మనసు స్వామి!!

3.
ఏడు కొండల మీద ఉన్న ఓ వేంకటేశ్వరా
నీ కైంకర్యాలు నిత్యం ఓ కన్నుల పండుగగా
నీ నిత్య కళ్యాణం ఒక లోక కళ్యాణంగా
నీ పాద సేవకై నేను ఎంతో వేచి ఉన్నాను స్వామి
నీ కృపా కటాక్షములు నాకు ప్రసాదించుము!!

4.
ఎన్ని అవతారాలు ఎత్తిన ఎక్కడవున్నా నీవే గోవిందా
మా జీవితాల్ని పరిపూర్ణంగా ముందుకు నడిపించే శ్రీనివాసా
కలలో అయిన ఇలలో అయిన నీ నామం స్మరించని వారే లేరు
నీ అనుగ్రహం కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు!!

5.
ప్రతీ రోజూ నీ కళ్యాణం ఓ పచ్చ తోరణం లాగా
నీ సహస్ర దీపా అలంకరణ ఓ దీపావళి లాగా
రంగు రంగు పూలతో తోమాల సేవ
ఇలా సేవలు అందుకుంటున్న ఓ వేంకటేశ్వరా
నీకు నా నమస్కారాలు!!

6.
వేంకటేశ్వరా నీ వైభవం విస్తారం
నీ దివ్య దర్శనం మాకు మహా యోగ్యం
తిరుమల గిరినిలయా, నీ పాద సేవయే మాకు మహాభాగ్యం
దివ్యమయ శ్రీనివాసా నీ సేవకై నేను ఎంతో వేచి చూస్తున్నాను స్వామీ
సర్వేశ్వరుడా సదా నిన్ను స్మరించు!!!

Exit mobile version