Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మల్లంపల్లి శరభయ్య సంస్మరణ పద్యకావ్య పురస్కారం – ప్రకటన

శ్రీ మల్లంపల్లి శరభయ్య సంస్మరణ పద్యకావ్య పురస్కారం – ప్రకటన

  1. సంస్కృతాంధ్ర సాహిత్య వారాన్నిధి శ్రీ మల్లంపల్లి శరభయ్య శర్మ గారి జన్మదినం మార్చి 23.
  2. ఆయన నాకు సాహిత్య అధ్యయన మార్గాన్ని బోధించిన గురువర్యులు. వారి కావ్యజ్ఞ శిక్ష వలననే నేను అంతో ఇంతో సాహిత్యాధ్యయనం చేయగలిగాను, వ్రాయగలిగాను.
  3. వచ్చే సంవత్సరం నుంచి “శ్రీ మల్లంపల్లి శరభయ్య సంస్మరణ పద్య కావ్య పురస్కారం” ప్రారంభిస్తున్నాను.
  4. ఈ పురస్కారం కేవలం 18 – 40 సంవత్సరాల మధ్య వారికే పరిమితం. తద్వారా రానున్న తరంలో పద్యకావ్య రచనకు ప్రోత్సాహం కలుగుతుందని ఆశిస్తున్నాను.
  5. ఈ పురస్కారానికి పద్య కవులు తమ కావ్యాలను మూడు ప్రతులు పంపవలసి ఉంటుంది.
  6. ప్రస్తుతానికి ఈ పురస్కారం ఒక్కరికే అందించబోతున్నాను. కాలక్రమంలో ముగ్గురికి అందించే ప్రయత్నం చేస్తాను.
  7. ఈ సంవత్సరం పురస్కార రూపంలో విజేతకు రూ.25,000 అందజేయడం జరుగుతుంది.
  8. ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి జన్మదినమైన మార్చి 23 వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే సభలో అందించటం జరుగుతుంది.
  9. ఈ పురస్కారానికి 2025 సంవత్సరంలో ప్రచురించిన పద్యకావ్యాలను మాత్రమే పంపాలి.
  10. పద్యప్రక్రియలో కథాకావ్యాలు, ఖండ కావ్యాలు, పద్య కవితా సంకలనాలు /సంపుటులు (కవి స్వీయ ప్రచురణలు మాత్రమే), శతకాలు ఏవైనా పంపవచ్చు.
  11. ఈ కావ్యాలు క్రింది చిరునామాకు 2026 సంక్రాంతి లోగా అందేటట్టు పంపించవలసి ఉంటుంది.

ఫణిహారం వల్లభాచార్య, ప్లాట్ 32, ఫ్లాట్ 112, విక్టోరియా మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్ ఎదురుగా, హుడా కాంప్లెక్, కొత్తపేట, సరూర్ నగర్, హైదరాబాద్ – 500035. Ph:+91 90002 21269. srivallabhaspiritual@gmail.com

  1. ఈ పురస్కారానికి ప్రాంతీయ పరిమితులు లేవు.
  2. ప్రాథమిక పరిశీలకులు ఎంపిక చేసిన వాటిని నుంచి ఇద్దరు న్యాయ నిర్ణేతలు తుది ఎంపిక చేస్తారు. అదే తుది నిర్ణయం.
Exit mobile version