సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    విల్సన్ రావు వృత్తి వేరైనా ప్రవృత్తి కవిత్వమే ప్రధానంగా.
    సరదాగా, ఒక వాక్యాన్ని ముక్కలు చేసి లైను కింద లైన్ రాసే కవి కాదు ఇతను. చాదస్తంగా రైతు, పొలం, నాగలి, దేశం, సమాజం, కుటుంబం, స్త్రీ – తల్లి, సహచరి, కూతురు… అంటూ గుండె లోతుల నుండి సహజమైన కవితా ఝరి పొంగి అక్షరాల్లో వొంపే కవి. దేవుడు తప్పిపోయాడు కవితా సంపుటి కంటే దాని పై వచ్చిన సమీక్షల సమాహార పుస్తకమే పెద్దది. అంతకు ముందు పత్రికల్లో తరచూ కవితలు వస్తున్నా, ఈ కవితా సంపుటితో “ఎవరీ విల్సన్ రావు” అని కవితా లోకం పరీక్షగా చూడడం మొదలుపెట్టింది. ఈసారి “నాగలి కూడా ఆయుధమే” అని తీర్మానం చేసాక విస్తుపోయింది. అవార్డులు, పురస్కారాలతో అక్కున చేర్చుకుంది. ఆ సందర్భంగా ఈ కవికి
    హృదయ పూర్వక శుభాభినందనలు.

    ఇంటర్వ్యూ అంటే “మీ బాల్యం, కవిత్వం ఎందుకు రాసారు, ఎవరి ప్రభావం…” అంటూ మూస ప్రశ్నలు కాకుండా, పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి అడిగిన సంచిక టీం కి అభినందనలు.

  2. 2

    రాంమోహన్ రావు తుమ్మూరి

    చదివాను మిత్రమా! వారడిగిన ప్రశ్నలకు మీ సాధికార సమాధానాలు సంబరపడేట్లు చేసాయి. మీ మీద మీకున్న అధికారం ప్రస్ఫుటమైతుంది. మీ సకారాత్మక దృక్పథం మీ కవితల నేపథ్యానికి భూమికగా నిలచింది.
    కం.నొప్పింపక తానొవ్వక
    ఒప్పిదమగు కవితలెన్నొ ఒనగూర్చుటలో
    తప్పక మీరలు గణ్యులు
    మెప్పింతురు బుధజనులను మేలగు రీతిన్
    కం.నా మిత్రుడు విల్సన్ కవి
    భూమిజుడగు రైతుగోడు భూరిగ జెప్పన్
    సామాజిక స్పృహ కల్గును
    సామాన్యుని నాయకునిగ చక్కగజేయన్
    కం. అభినందలివిగో గొను
    శుభములు మీకెల్లవేళ చొప్పడవలయున్
    నభమున తారకలకు వలె
    సభలందున మీకు యశము సాహో! కలుగున్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!