సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Bapujee Kanuru

    బెహరా సత్యనారాయణ మూర్తి ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా వుంది. పుస్తక ప్రచురణలో మూర్తికి వున్న శ్రద్ధ, ఆయన తపన, వారి నాన్నగారి సాహిత్యంపై ప్రేమ, తెలుగు కధలపై అభిమానం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. బెహరా వెంకట సుబ్బారావు గారిని ఈ తరం వారికి పరిచయం చేయడంలో సంచిక క్రియాశీలకమైన పాత్రపోషించింది. 2020లో అంటే సుమారు నాలుగేళ్ళ క్రితం వారిపై వ్యాసం ప్రచురించిన తొలి అంతర్జాల పత్రిక సంచిక. ఈ వ్యాసంపై వచ్చిన స్పందనలే ఈ పుస్తకం రూపుదాల్చడానికి ప్రేరణ.పుస్తకం ప్రచురించండం ఒక ఎత్తయితే ఆ పుస్తకాన్ని ప్రముఖులకు, కథాప్రియులకు అందించడంలో మూర్తి గారు, వారి బంధువు సన్యాసి రాజుగారు చూపిస్తున్న శ్రద్ధ అమోఘం. కదా సాహిత్యంలో మరో బుచ్చిబాబు బెహరా వెంకట సుబ్బారావు గారు. ఆయన సాహిత్యంపై పరిశోధన జరగాలి. తెలుగుతనం ఉట్టిపడే సుబ్బారావు గారి కధలు ఇతర భాషల్లోనికి అనువాదం జరగాలి. మూర్తి శ్రమకు అక్షరరూపం ఇచ్చి మా అందరిముందు నిలిపిన సంచికకు ధన్యవాదాలు తెలుసుకుంటూ.
    మీ
    బాపూజీ కానూరు

  2. 2

    bsnmurty756@gmail.com

    ఇంటర్వ్యూ అసాoతం చదివాను. చాలా విపులంగా వివరించావు…సంచిక టీమ్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు. ఈ పుస్తకం ప్రచురణ లో నువ్వు పడ్డ శ్రమ ప్రశంసించదగ్గది. ఈ బృహత్తర కార్యక్రమం లో పాలుపంచుకునే అవకాశం నాకు కూడా కల్పించి నందుకు ధన్యవాదములు. ఆవిష్కరణ కారు లో మన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నందుకు , ఆవిష్కరణ రమణ చిన్నాన్న చేతుల మీదుగా జరిగినందుకు మహదానందం కలిగింది.
    ఆవిష్కరణ తదనంతర పరిణామాలు, సాహితీ ప్రముఖులను కలియడం ముదావహం. నువ్వు చెప్పినట్లు ఇంకా చాలా చేయవలసినది ఉంది. దానికి నా సహకారం తప్పక ఉంటుంది….
    శుభం భూయాత్..
    K. Sanyasi Raju, AGM, SBI, Hyderabad

  3. 3

    bsnmurty756@gmail.com

    తమ్ముడు నాన్నగారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావడానికి కృషిచేస్తున్న నీకు అభినందనలు. అసలు ఈ నెలన్నరలో నాన్నగారి రచనలు ఎంత ప్రాచుర్యం పొందాయో తలుచు కొంటే వొళ్లు పులకరిస్తోంది. నాన్నగారు ఎక్కడ ఉన్నా ఎంతో సంతోషిస్తారు. ఈ రోజు ఆయన పుణ్యతిధి కదా తప్పకుండా వచ్చి నీకు నీతో పాటు మమ్మల్ని ఆశీర్వదించి వుంటారు. ఆయన ఆశీర్వాద బలంతొ ఇంకా నువ్వు అనుకొన్న తీరానికి తీసుకెళ్తావని ఆకాంక్షిస్తున్నాను. సంచిక అంతర్జాల పత్రిక వారు అడిగిన ప్రశ్నలకు, నువ్వు చెప్పిన సమాధానాలు చూస్తుంటే, కథలు పై నీకు ఎంతో పట్టు వుంది అని తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి కథను విపులంగా వివరిస్తూ వారికి సమాధానం చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. నాన్నగారి కోరికను తీర్చాలనే నీ ప్రయత్నానికి తగ్గట్టు కొంత మంది పెద్దలు కూడా నీకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో నాన్నగారి సాహిత్యం ఇంకా ప్రాచుర్యం పొందుతుందని బలంగా అనిపిస్తుంది.

    Ch. Satyavani, visakhapatnam

  4. 4

    bsnmurty756@gmail.com

    సత్యనారాయణ మూర్తి గారు….మీరు సంచిక పత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ అమోఘం 👏👏🙏నాన్నగారి రచనలను తారాపథంలో నిలిపేందుకు మీరు చేస్తున్న కృషి, అందుకొరకు మీ పట్టుదల కడు ప్రశంసనీయం! మీకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు 💐👏భవిష్యత్ లో తలపెట్టబోతున్న కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను 👍👌ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన సంచిక టీం కు అభినందనలు…

    నాన్నగారి తిథిని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక నివాళి, నమస్సుమాంజలి🙏🙏💐🙏🙏

    బ0బి, Dubai

  5. 5

    bsnmurty756@gmail.com

    సంచిక పత్రిక వారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు.వాటి అన్నిటికి నువ్వు ఇచ్చిన సమాధానాలు చాలా బావున్నాయి.
    ఒక్కొక్క కథకి వివరణ ఇస్తూ వారికి చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని సాహిత్య లోకంలో మెరవడానికి నువ్వు చేస్తున్న కృషిని వివరించావు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని చెప్పావు ఎంతో ప్రశంసించవలసిన విషయం.

    ముఖ్య విషయం అన్ని జిల్లా గ్రంధాలయాల్లోను నాన్నగారి పుస్తకాన్ని పొందుపరచడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం గర్వించదగినది.
    ఈ మహోత్తర ప్రయాణంలో నీకు సహకరిస్తున్న వారి అందరికీ నా కృతఙ్ఞతలు.
    అమ్మ నాన్నగారికి
    నమస్సుమాంజలితో
    🙏🙏🙏🙏

    అనంత విజయ పద్మజ,
    ఉపాధ్యాయురాలు. Hyderabad

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!