ప్రతి పగలూ
పొద్దు గూకుతుంది
ప్రతి రాత్రీ
తెల్లవారుతుంది
కారినవో ఇంకినవో
కొన్ని కన్నీటి
ఛాయలుంటాయి
కలిసినవో వీడినవో
కొన్ని అనుభూతి క్షణాలు
మిగిలే ఉంటాయి
నడిచినవో నిలిచినవో
కొన్ని దారులు
ఏర్పడేవుంటాయి
మంచివో చెడ్డవో
రోజూ కొన్ని అనుభవాలు
ఎదురవుతూనే ఉంటాయి
గెలిచినవో ఓడినవో
కొన్ని సంఘటనలు
గుర్తుంటాయి
విజయులో అమరులో
కొందరు యోధులు
నిలిచే వుంటారు
ఏ ఒక్క రోజూ
మాయ కాదు మిధ్యా కాదు
కొంచెం ‘సోయి’ఉండాలి
మెత్తటిదో గట్టిదో
నీకో మనసుండాలి
ఇవ్వడానికయినా పుచ్చు కోవడానికయినా
అవును జీవితంలో
ఏ ఒక్క రోజూ వృథా కాదు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత