[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘సూర్యోదయం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
ఆకాశం ఎప్పుడూ ఆశ్చర్యమే, ప్రతిఫలించే రంగులెన్నో..! సూర్యుడు ఉదయించినపుడు ఆనందోత్సాహాలు.. ఉల్లాసాల రంగుల వర్ణ చిత్రాలు! సాయం సంధ్య వేళ.. నారింజ ఎరుపు వర్ణ శోభితం మరచిపోలేని సువర్ణ కలశం! ఒక్కోసారి ఆకాశంలో.. పత్తి పోగు — చెల్లాచెదిరిపోయినట్టు, తెల తెల్లటి మేఘపు తునకలు! అప్పుడు చూడాలి పిల్ల మేఘాలు.. పెద్ద మేఘాలు అన్నీ ఒకటే హడావిడి..! కొన్ని తెల్ల మేఘాలు ఉయ్యాలలూగుతాయి కొన్ని బుద్ధిమంతుల్లా.. ప్రకాశవంతంగా.. నిర్మలంగా.. చెదిరినట్టుగా సాగిపోతుంటాయి.. మేఘాలన్నీ కలిసి సూర్యుణ్ణి దాచేస్తాయి..! అవి సూర్య మండలంలోకి వెళ్లగలవో.. లేవో గానీ.. సూర్యుడు మాత్రం – మేఘాలను తప్పించుకుని , ఉరికురికి వచ్చేస్తాడు! వీటన్నింటికీ అతగాడు అతీతుడు కదా.. నల్లని ఆకాశంలో.. చంచలమైన మేఘాలను దాటి ఉదయిస్తాడు..! ఎందుకంటే ఈ సమస్త విశ్వాన్ని వెలిగించాలి కదామరి..!!
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తిరుమలేశుని సన్నిధిలో… -22
చిరుజల్లు-78
కాజాల్లాంటి బాజాలు-69: ఇంటికంటె గుడి పదిలం
జ్ఞాపకాల పందిరి-78
సంగీత సురధార-36
పొద్దు పొడుపు వెన్నెల
ఏకాంత సాధన
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-70
సీత -1
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -27
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®