Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్నేహం సత్యం శివం సుందరం

స్నేహం మౌనంగా పలకరిస్తుంది
మొదట
హృదయమంతా పాకుతుంది
పిదప
మనసులో తిరుగాడు
జీవ కళ
స్నిగ్ధ సౌందర్య విద్యుల్లత
సోపతి
ఆనందాల మంజుల మయూఖ
ఆపతి సంపతిలో
నిత్య నిర్మల పూ పొప్పడి పరిమళం
సాహవాసం
అరమరికల్లేని నిస్వార్ధ మైత్రి
నిజమొక్కటే ఇలలో…

Exit mobile version