[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
Too much..Too much..
~
చిత్రం: అనగనగా ఓ అమ్మాయి
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మణిశర్మ
గానం: దేవీశ్రీ ప్రసాద్ & కోరస్
~
పాట సాహిత్యం
పల్లవి:
Too much too much
Too much మచ్చా Too much ఛఛా Too much
Makeup లేని faces gossip లేని papers Lockup death
ఒకటైనా లేని police station too much
Leakage లేని college, teasing లేని teenage
Late అవ్వకుండా ట్రైనొచ్చేసే railway stations too much
Corruption అంటూ లేనే లేని government office
Donation అంటూ లేకుండానే సీటిచ్చేసే convents
Fever వస్తే tumor దాకా టెస్టులు రాయని doctors
ఇలాంటి వన్నీ ఇలాతలంతో ఇవాళకూడా ఉన్నాయంటే
Too much Too much Too much
చరణం:
చిరంజీవి సినిమాకి first day ticket దొరికితే Too much
అరే! సిటీ బస్సులో కండక్టర్ నీ change తిరిగిస్తే Too much
కాజోల్లాంటి beautyపిల్లకి jackal
లాంటి naughty పిల్లడు కన్నేకొడితే
చెప్పుకి బదులు చెయ్యందిస్తే Too much
MTV channel చూడక cartoon
చూసే పిల్లలు ఉండే ఇల్లుంటుందని నమ్మావంటే Too much
పక్క ప్లాటులో ఎవడున్నాడో నీకు తెలిస్తే Too much
అరే! చెక్కెర వ్యాధే రాకుండా నీ షష్టి పూర్తయితే Too much
హత్యావార్తలు లేని daily, sex
ప్రశ్నలే లేని weekly
ఇలాంటివన్నీ ఇలాతలంలో ఇవాళ కూడా వున్నాయంటే
కోరస్:
Too much మచ్చా Too much ఛఛా Too much
చరణం:
శ్రీశ్రీ ఎవరో గురజాడెవరో నీకు తెలిస్తే Too much
అరే! రాజధానిలో ట్రాఫిక్ రూల్సే పాటిస్తే Too much
మధ్యంతరమంటూ లేక మద్దతు అవసరమే రాక
మన దేశంలో ఒకే ప్రభుత్వం ఐదేళ్ళుంటే Too much
ఉల్లిపాయకన్నా పాపం వాజపేయి మిన్నా అంటూ
దేశంలో ఓటర్లంతా అనుకున్నారంటే Too much
సచిన్ లేకుండా క్రికెట్ మాచ్లో మనం గెలిస్తే Too much
అరే! కరెంటు కోతలు లేకుండానే Summer గడిస్తే Too much
ముష్టివాళ్ళే లేని టెంపుల్స్,
అప్పుల బాధే లేని కొంపల్స్
ఇలాంటివన్నీ ఇలా తలంలో ఇవాళ కూడా ఉన్నాయంటే
కోరస్:
Too much మచ్చా Too much ఛఛా Too much
♠
ఎప్పుడో 1964లో.. ‘దేశమ్ము మారిందోయ్, కాలమ్ము మారిందోయ్, కష్టాలు తీరేనోయ్, సుఖాలు నీవేనోయ్..’, అనే కొసరాజుగారి గీతం, అప్పట్లో ఎంతో తీయగా, ఆశావహ దృక్పథాన్ని పెంచేదిగా ఉండేది. అయితే, ఆ మార్పు పెనుమార్పై, ఇప్పుడు మాత్రం ఎంతో చేదుగా అనిపిస్తుంది. దీనికి కారణం, రోజురోజుకు update అవుతున్న సాంకేతికతను మనం వేలం వెర్రిగా, విశృంఖలంగా వినియోగించడమే! మనం చాలా enlighten, heighten అయిపోయామనుకుంటూ, misleading technology తో బ్రతుకులను అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ‘ఏంటండీ! ఇంకా చాదస్తపు ఆలోచనలు! ఏవో పాతకాలపు ఆలోచనలు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? కాస్త modernize అవ్వచ్చుగా! అని సలహాలిస్తూ.. ఈ generation gap.. చాలా ఇబ్బందిగా ఉందని వాపోతూ.. modern outlookని ఒలకబోస్తూ ఉంటారు ఈ generation వాళ్లు చాలామంది.
‘Modern attitude’ ని ‘A mindset or outlook that reflects contemporary values, ideas, and behaviors’, అని నిర్వచించుకోవచ్చు.
Traditional నుండి Modern, దాని నుండి Postmodern society లు రూపుదిద్దుకున్నాయి. ఈ ఆధునిక సమాజాల తీరును Neil Adams, తన Modern Society అనే కవితలో ఇలా వివరిస్తున్నారు.
Children know and see today
That life doesn’t have to be this way
They open their eyes and realize
Its not all hate its not all lies
…….
But what you see is what you get
All the sexism, hate and racism bet
……
Is the media part of the blame
Or all the role models all the fame
……..
But the world will go on and on
Never to realize that this is wrong
But life is life gotta live with that
And go on and on like society’s rat..
~
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, మితిమీరిన ఆధునికత; ప్రవర్తనలోనూ, మనస్తత్వాలలోనూ, విలువలలోను.. జీర్ణం చేసుకోలేని మార్పులను తీసుకువచ్చింది. ‘ఒకప్పుడు.. అప్పట్లో.. ఆ రోజుల్లో..’ అంటూ గతాన్ని నెమరేసుకుంటూ, గడిచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ, మారిన పరిస్థితుల్లో రాజీ పడలేక సతమతమైపోతున్న త్రిశంకు స్వర్గం లాంటి జీవితాలు, పాత తరానికి – ఆధునిక తరానికి మధ్యలో వారధిలా ఉన్న ఒక మధ్య తరం Metamodern తరమన్నమాట! అటువంటివారు, పాత విలువలకు తిలోదకాలు ఇవ్వలేక, కొత్త తరం పోకడలను అనుసరించలేక, సమాజం మళ్ళీ తన సహజత్వంలోకి రావాలనీ, స్వస్వరూపంలో ఒదిగిపోవాలని కలలు కంటూ ఉంటారు.
అటువంటి సమాజానికి చెందిన సీతారామశాస్త్రి గారు, ఆధునిక సమాజ పోకడలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే, ‘అనగనగా ఓ అమ్మాయి’, చిత్రంలోని ‘టూ మచ్ టూ మచ్’ అనే పాట! కానీ ఆ వ్యంగం వెనుక సమాజం తీరుతెన్నులు అనుకోని విధంగా మారిపోయాయన్న ఆవేదన, మారుతుందన్న ఆశావహ దృక్పథం – మనకు మెండుగా కనిపిస్తాయి.
పల్లవి:
Too much too much
Too much మచ్చా Too much ఛఛా Too much
Makeup లేని faces, gossip లేని papers Lockup death
ఒకటైనా లేని police station too much
Leakage లేని college, teasing లేని teenage
Late అవ్వకుండా ట్రైనొచ్చేసే railway stations too much
Corruption అంటూ లేనే లేని government office,
Donation అంటూ లేకుండానే సీటిచ్చేసే convents,
Fever వస్తే tumor దాకా టెస్టులు రాయని doctors
ఇలాంటి వన్నీ ఇలాతలంతో ఇవాళకూడా ఉన్నాయంటే
Too much Too much Too much
సహజత్వానికి ఎంతో దూరంగా మా/పారిపోతున్న ఆధునిక సమాజం, painted-faces తోనే ముందుకు సాగుతూ, అదే ఆధునికత అని మురిసిపోతోంది. ఎన్ని artificial things చుట్టూ తగిలించుకుంటే, అంత, fashionable, అంత updated అన్నట్టు! విద్యా వ్యవస్థల్ని, సమాచార వ్యవస్థల్ని, వైద్య వ్యవస్థని, ప్రభుత్వాల తీరుతెన్నుల్ని, సున్నితంగానే ఎండగడుతున్నారు సిరివెన్నెల పల్లవిలోనే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రులకు వెళితే ఏమవుతుందో వివరిస్తూ.. /Fever వస్తే tumor దాకా టెస్టులు రాయని doctors/ ఇంకా ఉన్నారా? వుంటే, ఇది too much అంటున్నారు. లాకప్ మరణాలు లేని పోలీస్ స్టేషన్లు, పుకార్లు, కల్పించిన వార్తలు లేని మీడియాలు, సరైన సమయనికి రైళ్లు నడిచే రైల్వే స్టేషన్స్, లంచగొండితనానికి దూరంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కనిపిస్తే ఆశ్చర్యమే! అనేది, సిరివెన్నెల గారి statement.
చరణం:
చిరంజీవి సినిమాకి first day ticket దొరికితే Too much
అరే! సిటీ బస్సులో కండక్టర్ నీ change తిరిగిస్తే Too much
కాజోల్లాంటి beauty పిల్లకి jackal
లాంటి naughty పిల్లడు కన్నేకొడితే చెప్పుకి బదులు చెయ్యందిస్తే Too much
MTV channel చూడక cartoon చూసే
పిల్లలు ఉండే ఇల్లుంటుందని నమ్మావంటే Too much
పక్క ప్లాటులో ఎవడున్నాడో నీకు తెలిస్తే Too much
అరే! చెక్కెర వ్యాధే రాకుండా నీ షష్టి పూర్తయితే Too much
హత్యావార్తలు లేని daily, sex ప్రశ్నలే లేని weekly
ఇలాంటివన్నీ ఇలాతలంలో ఇవాళ కూడా వున్నాయంటే
కోరస్:
Too much మచ్చా Too much ఛఛా Too much
చరణంలో కూడా అదే ధాటిని కొనసాగిస్తూ.. ఈ కాలంలో ప్రతి వాళ్లు (ఎక్కువ శాతం).. ‘నేను డయాబెటిక్ అండీ! నాకు హైపర్ టెన్షన్ అండీ! అయినా ఈ కాలంలో మామూలే లెండి, ఎవరికి లేవు ఆరోగ్య సమస్యలు?’ అంటూ ఉంటారు. అందుకనే సిరివెన్నెల అంటున్నారు, /అరే! చెక్కెర వ్యాధే రాకుండా నీ షష్టి పూర్తయితే Too much/ అని. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే, screen mania గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ అడిక్షన్ వల్ల, ఎంతమంది పిల్లలు మానసిక వ్యాధులకు గురవుతున్నారో మనకు తెలియనిది కాదు. ‘చిన్నపిల్లలు’ అని వారి వయసుకు తగినట్టు ఏ కార్టూన్ నెట్వర్కులో చూడకుండా పద్ధతిగా ఉంటే ఆశ్చర్య పోవాల్సిందే అంటున్నారు సిరివెన్నెల. /MTV channel చూడక, cartoon చూసే పిల్లలు ఉండే ఇల్లుంటుందని నమ్మావంటే Too much/ ఊరందరిని, ‘పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, తాతయ్య, బామ్మ, అన్న, అక్క,’ అంటూ.. వరుసలు కలుపుకుని అందరూ మనవారు అనుకునే కాలం ఎప్పుడో మారిపోయింది. ఎవరి జీవితం వారికి ఎంత బిజీ అయిపోయింది అంటే, ఇరుగు పొరుగు వారి ఆనవాళ్లు ఏమాత్రం తెలియకుండా, ఎవరూ పట్టనట్టుగా తమకు తాము జీవిస్తున్నారు. ఇలాంటి వ్యవహార శైలిని ఘాటుగా నిరసిస్తున్నారు, సిరివెన్నెల.
చరణం:
శ్రీశ్రీ ఎవరో గురజాడెవరో నీకు తెలిస్తే Too much
అరే! రాజధానిలో ట్రాఫిక్ రూల్సే పాటిస్తే Too much
మధ్యంతరమంటూ లేక మద్దతు అవసరమే రాక
మన దేశంలో ఒకే ప్రభుత్వం ఐదేళ్ళుంటే Too much
ఉల్లిపాయకన్నా పాపం వాజపేయి మిన్నా అంటూ
దేశంలో ఓటర్లంతా అనుకున్నారంటే Too much
సచిన్ లేకుండా క్రికెట్ మాచ్లో మనం గెలిస్తే Too much
అరే! కరెంటు కోతలు లేకుండానే Summer గడిస్తే Too much
ముష్టివాళ్ళే లేని టెంపుల్స్, అప్పుల బాధే లేని కొంపల్స్
ఇలాంటివన్నీ ఇలా తలంలో ఇవాళ కూడా ఉన్నాయంటే
/శ్రీశ్రీ ఎవరో గురజాడెవరో నీకు తెలిస్తే Too much/ ఇప్పట్లో ఉన్న యువతను, దేశానికి సంబంధించిన జాతీయ నాయకుల గురించి గానీ, జాతీయ చిహ్నాల గురించి గానీ, భాషా వారసత్వానికి సంబంధించిన విషయాల గురించి గానీ (ఇక పురాణేతిహాసాల ప్రసక్తి గురించి చర్చించనేకూడదనుకోండి!) ప్రశ్నిస్తే, వాళ్లు చెప్పే సమాధానాలతో మనకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. మనసు పెట్టి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునే చదువు నిజంగా దూరమైపోయింది. ఇలాంటి విషయాల్లో ఏ కొద్దిమందికో మినహాయింపు ఉంటుందనుకోండి! అలా అజ్ఞానంలో ఉన్న యువత తీరు గురించి కవి తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ల తీరుతెన్నులు, ప్రభుత్వాల అస్థిరత గురించి కూడా సిరివెన్నెల కావలసినన్ని చురకలు అంటిస్తున్నారు. ఒకవేళ వాజ్పేయి లాంటి అనుభవజ్ఞులు, పరిపాలనాదక్షులు అధికారంలో ఉన్నా, కేవలం ఉల్లిపాయ ధరను manipulate చేసి, గద్దె దించిన సందర్భాలను, ఓటర్ల విజ్ఞతను, ఆయన సూటిగా, ఘాటుగా విమర్శిస్తున్నారు.
Virtual money చలామణీలోకి వచ్చాక, క్రెడిట్ కార్డుల మాయలో మనం ఆడుతున్న నంబర్ గేమ్స్, మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న అనడంలో సందేహమే లేదు. చేతిలో డబ్బులు పట్టుకొని, దాన్ని ఆలోచించి ఖర్చు పెట్టే తీరుకి, కార్డులు పట్టుకొని మనం చేసే లావాదేవీలకి నిస్సందేహంగా చెప్పలేనంత తేడా వస్తుంది. అందుకే ఆయన /ముష్టివాళ్ళే లేని టెంపుల్స్, అప్పుల బాధే లేని కొంపల్స్/ ఉన్నాయంటే ఆశ్చర్యపోవలసిందే, అంటున్నారు.
వ్యవస్థలో చాలా రంగాల్లో ఉన్న అవకతవక ధోరణులను సునిశితంగా పరిశీలించడమే కాక, అవి వ్యవస్థీకృతంగా ఎలా మారాలో కూడా indirect గా సిరివెన్నెల సూచిస్తున్నారు. /ఇలాంటివన్నీ ఇలా తలంలో ఇవాళకూడా ఉన్నాయంటే/.. ఈ వాక్యం ఎంత లోతైన బాధను వ్యక్తం చేస్తుందో చూడండి! ఈ భూమ్మీద ఇంకా సరైన వ్యవస్థలు ఉన్నాయా? మనుషులు పద్ధతిగా నడుచుకుంటున్నారా? వృత్తికి అంకితమైన నిజమైన వైద్య సేవలను నిజాయితీగా అందించేంత మంచి డాక్టర్లు ఉన్నారా? ఇంత నిజాయితీగా, ధన సంపాదనకు కాకుండా, విద్యను పంచడానికి నిర్దేశించిన విద్యాలయాలు ఉన్నాయా? ప్రజాసేవకు నిజంగా అంకితమైన, స్వార్థ రహిత రాజకీయ పక్షాలు ఉన్నాయా? నికార్సయిన వార్తలను అందించే మీడియా హౌస్లు, తన వయసుకు తగిన రీతిలో ప్రవర్తించే చిన్నారులు, రోడ్డు మీదికి వస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్న కనీస నిబద్ధత కలిగిన పౌరులు, నిజాయితీ కలిగిన ఓటర్లు, లంచగొండితనానికి దూరంగా ఉన్న అధికారులు.. కాగడా పెట్టి వెతికితే.. నూటికో కోటికో ఒకరు దొరుకుతారేమో! అవన్నీ కావాలంటే, Utopia అని భావించుకునే Plato ఆదర్శ రాజ్యం గురించి కలలు కనాలి కాబోలు. ఏదేమైనా, సానుకూల దృక్పథానికి ఊట బావిలాంటి సిరివెన్నెల భావజాలం, మంచిని నిరంతరంగా ఆశిస్తూనే ఉంటుంది. ఆయన ఆశయాలు/మన ఆశయాలు సిద్ధించాలని, వ్యవస్థీకృతమైన మంచి సమాజాలు రూపుదిద్దుకోవాలనీ ఆశిస్తూ, సిరివెన్నెలకు hats off చెప్పుకుందాం.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.