[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
మందితో పాటుగా ముందుకే సాగనా
~
చిత్రం: యాత్ర సంగీతం : కె. కృష్ణ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాయి చరణ్.
పాట సాహిత్యం పల్లవి: మందితో పాటుగా ముందుకే సాగనా ఎందుకో తోచక ఒంటిగా ఆగనా ఏ దరీ లేదని ఈదడం మాననా ఎంతకీ తేలని ప్రశ్నగా మారనా ॥ మందితో పాటుగా ॥
చరణం: అందరూ ఆశగా నిన్ను చూస్తుండగా అనుక్షణం నీడగా వెంట వస్తుండగా మొదటి అడుగై నువ్వే గడప దాటాలిగా నమ్మకం బాటగా నడిచి తీరాలిగా అందరూ ఆశగా నిన్ను చూస్తుండగా అనుక్షణం నీడగా వెంట వస్తుండగా ♠ ప్రపంచానికి పెద్దన్నయ్య అని పిలువబడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో ఉత్కంఠతో ముగిసి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రారంభానికి ముందు నుండే, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరు నెగ్గితే ఏ వ్యవస్థలకి లాభం? ఏ వ్యవస్థలకి నష్టం? ఒకవేళ, ట్రంప్ నెగ్గితే ఎలాంటి విధానాలు అమల్లోకి రావచ్చు..? వంటి ఊహాగానాలు, చర్చలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ చర్చల సందర్భంగా, ‘We are making predictions about the most unpredictable man’ అంటూ Republic TV కి చెందిన Arnab Goswami, కామెంట్ చేయడం మనం చూశాం. గ్లోబల్ విలేజ్‌గా మారిన నేటి ప్రపంచంలో, ఏ వ్యవస్థలో ఏ మార్పు వచ్చినా, మరి ముఖ్యంగా అత్యంత ప్రభావాన్ని చూపించే అమెరికా వంటి most influential సమాజాలలో రూపొందే విధానాల impact అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే, ఒక నాయకుడి శక్తి అలాంటిది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలలోపే దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయవచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ఫెడరల్ ఏజెన్సీలకు జారీ చేసే ఆదేశాలు – వలసల నుంచి.. సరిహద్దు విధానం, వాతావరణ మార్పులపై చర్యలు, ఇంధనం, క్రిప్టో కరెన్సీ, international relations లాంటి అనేక అంశాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. మన దేశ ఆర్థిక విధానంపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. డాలర్ మారకంతో రూపాయి విలువ రోజురోజుకి తరిగిపోతోంది. ప్రస్తుతమున్న close-knit అంతర్జాతీయ వ్యవస్థలో, చిన్న తేడా కూడా పెను మార్పులకు దారితీస్తుంది.
ఒక ఇంటి పెద్దకు చక్కటి నిర్వహణ సామర్థ్యం ఉంటే, ఆ ఇంటి సభ్యులు బాగుపడతారు. ఒక రాష్ట్రానికి సరైన నాయకత్వం లభిస్తే రాష్ట్రం, దేశానికి సక్రమమైన దిశా నిర్దేశకులు దొరికితే, దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారు. అందుకే నాయకుడనేవాడు అభివృద్ధికి చుక్కాని కావాలి. A real Leader is one who knows the way, goes the way and shows the way అంటారు Maxwell.
అత్యంత పురాతన సాంఘిక శాస్త్రమైన రాజనీతి శాస్త్రము, రాజకీయ శాస్త్రంగా మారి చాలా మారి శతాబ్దాలయ్యింది. Political Science, Politics అయిపోయి power game నడిపిస్తోంది. అది స్వార్థానికి, అరాచకత్వానికి, అధికారబలానికి icon లా మారిపోయింది. ఎక్కడో భూతద్దం పెట్టి వెతికితే తప్ప, selfless service కనిపించడం లేదు. Selfish అంటే నాకు ఒక విషయం గుర్తువస్తుంది. ఒక చేప పిల్ల తల్లిని ఇలా అడిగిందట; Dear mother, dear mother! Why should we live only in water? Why not on the land? దానికి తల్లి చేప ఇలా సమాధానం ఇచ్చిందట; Oh, honey! Water is for the fish and land is for the Sel‘FISH’!
Politics లో నాణ్యత ప్రమాణాలు, విలువలు పెరిగి ‘qualitics’ గా మారితే తప్ప ప్రజలకు అనుకున్నంత న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే సరియైన నాయకులు కావాలి. Good leader, Great leader ల మధ్య బేధాన్ని వివరిస్తున్నారు Adam Grant.
“Good leaders build products. Great leaders build cultures. Good leaders deliver results. Great leaders develop people. Good leaders have vision. Great leaders have values. Good leaders are role models at work. Great leaders are role models in life.”
ఇప్పటివరకు మనకు చరిత్ర గతిని మార్చిన వారు great leaders మాత్రమే. ‘ఇన్నాళ్లు రాజకీయ చదరంగంలో ఆరితేరాం. కానీ ప్రజలు రాజకీయ వేత్తల గురించి ఏమనుకుంటున్నారో, రాజకీయాల నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోలేదు. ఇప్పుడా పని చేద్దాం. ప్రజలను ప్రజలతో ఉండి చూద్దాం. ప్రజల గుండె సడి విందాం’ అంటూ, పాదయాత్ర ద్వారా ప్రతి గుండెను తడమాలనుకున్న వైయస్సార్ అనే ఒక నాయకుడి, ప్రజా సంక్షేమ ప్రస్థానాన్ని తెరకెక్కించగా, అందులో నాయకుడి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, అనుభవాన్నే సిరాగా నింపుకున్న సిరివెన్నెల ‘యాత్ర’ చిత్రానికి పాటలను అందించడం జరిగింది.
ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొని, రాజకీయాల్లో తనకంటూ ఒక ఉనికినీ, స్థానాన్ని ఏర్పరచుకున్న వైయస్సార్, ప్రజా సంక్షేమానికి పాలసీలను రూపొందించడానికి ముందు, పాదయాత్ర చేస్తూ రాష్ట్రమంతా గడప గడపకు తిరిగి, ప్రజలతో మమేకమై ప్రతి పౌరుడి గుండెను తట్టి, వారి బ్రతుకుచిత్రాలు, కష్టాలు, కన్నీళ్లు, దగ్గర నుండి చూసి, మనసు ద్రవించి, వారి కోసం ఏదో చేయాలన్న తపన కలిగింది. ఆ అనుభవాల సారంగానే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది.
ఈ చిత్రంలో తాను రాసిన పాటల గురించి మీడియాలో వివరిస్తూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, స్వయంగా ఇలా చెప్పారు. ‘ఈ కథలో రాజకీయాల తాలూకు మౌలిక విలువలు చర్చించబడ్డాయి. తెలిసిన చరిత్ర వెనుక ఉన్న, తెలియని తపన, ఆలోచన, స్పందన, ఇందులో చిత్రీకరించబడ్డాయి. అంతకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తన అనుభవం నుండి ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉందన్న ఎఱుకతో, ఒక కొత్త మెలకువతో, ఒక కొత్త సుప్రభాతానికి నాంది పలికినట్టుగా వుంది.’
సత్యసాక్షాత్కారం కావాలంటే, మూలాల్లోకి వెళ్లాలి. జనజీవన నాడి తెలుసుకోవాలంటే, దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లోకి వెళ్ళాలి, మట్టి వాసన పట్టుకోవాలి. అందుకేనేమో ఇంగ్లీషులో కూడా, grassroot level లో పరిశోధన జరగాలని, అహంకార రహితంగా ఉంటే down to earth అనీ వాడుతుంటారు. ఈ చిత్రంలోని ఒక పాటలో సిరివెన్నెల అంటారు, ‘వసుధకే వందనం చెయ్యకుండా, నింగిపైకి ఎగురుతుందా గెలుపు జెండా? ఆశయం నెత్తురై పొంగకుండా, శ్వాసలోని సమర శంఖం మోగుతుందా?’
ఇప్పుడు మనం చర్చించబోతున్న పాటలో ఒక పల్లవి ఒక చరణం మాత్రమే ఉంటాయి. ఇది, చిత్రంలో ఒకానొక సందర్భంలోని నాయకుడి అంతర్మథనానికి అద్దం పడుతుంది.
పల్లవి: మందితో పాటుగా ముందుకే సాగనా ఎందుకో తోచక ఒంటిగా ఆగనా ఏ దరీ లేదని ఈదడం మాననా ఎంతకీ తేలని ప్రశ్నగా మారనా
‘యాత్ర’ చిత్రంలో అనుకున్న సమయం కన్నా ముందుగా ఎన్నికలు వచ్చినప్పుడు, వైయస్సార్ ఆత్మలో ఒక చర్చ జరుగుతుంది. గెలుస్తామా లేదా అన్న సందిగ్ధం, ఒక సందేహం, ఒక తత్తరపాటు చోటు చేసుకుంటాయి. ఎన్నికలు అంటేనే ఎన్నో సమీకరణాలు, అంచనాలు, లెక్కలు ఉంటాయి. ఎన్నికల బరిలోకి దిగడం అంటే, ఒక యుద్ధం చేయడమే! భారత యుద్ధానికి ముందు కూడా కృష్ణార్జునుల మధ్య ఒక సంవాదం జరిగిందని చెబుతారు. కృష్ణుడు, అర్జునుడు వేరువేరుగా ఎక్కడో లేరనీ, మనలోని ప్రశ్న అర్జునుడైతే, సమాధానం శ్రీకృష్ణుడు అవుతాడని సిరివెన్నెల అంటారు. విశ్వంలో సముద్ర మథనం ఒకసారి జరిగితే, మన మనసులో సంఘర్షణల మథనం నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణ నుండే, ‘To be or not to be, that is the question’, అనే అంశం తేలుతుంది. జీవితం అంటేనే నిర్ణయాల సమాహారం. Life is all about decision making.
అందరితోపాటు అలా ముందుకు సాగిపోవాలా? నేను దారి మరల్చుకోవాలా? నలుగురు నడిచిన దారిలోనే నేనెందుకు నడవాలి? అందరూ చేసినట్టే నేనెందుకు చేయాలి? అన్న మీమాంసతో ఒకవైపు, అలా ఎందుకు చేయాలో తోచక ఆగిపోవాలా? అన్న ఆలోచన మరోవైపు నాయకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఈ సందర్భంలోనే ఆయన ఒక మాట వ్రాస్తారు.
ఏ దరీ లేదని ఈదడం మాననా? అన్న సముద్ర గంభీరమైన ప్రశ్నకు, సిరివెన్నెల సమాధానమిస్తూ, ప్రతి నేత, ప్రతి వ్యక్తి, ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఊపిరి తడబడుతున్నా, ఈదడం ఆపకూడదు, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు, ప్రశ్నలు వద్దు, ప్రయాణమే అన్నిటికీ సమాధానమవుతుంది! ఈ వాక్యం ద్వారా మనందరికీ ఎంత గొప్ప life lesson అందించారు కదా!
ఈ ప్రశ్నకు, తీరం కనిపించడం లేదని, ఈదడం ఆపేస్తామా? అని అంతరంగం నుండి సమాధానం వస్తుంది. ఏ విషయాన్నీ తేల్చుకోలేకపోతే, ఎందరి జీవితాలకో సమాధానంగా మారవలసిన నాయకుడి జీవితం, ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది కదా! అన్న సందేశం, సరైన నిర్ణయం తీసుకోమనే సూచన మనకు ఇక్కడ కనిపిస్తాయి.
‘Road not Taken’ poem లో కూడా Robert Frost, ఏ దారి ఎంపిక చేసుకోవాలి అనే unending dilemma నుండి బయటపడి, చివరకు అందరూ నడిచిన త్రోవ కాకుండా, తక్కువ మంది నడిచిన (Less trodden road) దారిని ఎంపిక చేసుకుంటాడు.
ఈ Classic dilemma నాయకులకే కాదు, ప్రతివారి జీవితంలోనూ నడుస్తుంది. ప్రతి మలుపులోనూ, సరైన నిర్ణయం తీసుకుంటేనే, సరైన సమయానికి గమ్యాన్ని చేరగలం అనే సందేశం సిరివెన్నెల మనకిక్కడ అందిస్తున్నారు.
గొప్ప ఆశయాలు సాధించే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, they don’t different things but do things in a different way, అని మనకు అర్థమవుతుంది. ‘ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టెది మరో దారి’, అనిపించుకున్న వాళ్లు మాత్రమే ప్రపంచానికి అద్భుతాలు సాధించి చూపించారు. Only different way of doing makes all the difference in life.
ఈ చిత్రంలోని మరో పాటలో ఇలాంటి సందర్భంలోనే.. /ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది, అంతరంగమే కథనరంగమైనది/ప్రాణమే బాణం వల్లే తరుముతున్నది, నిన్ను నీవే జయించి రారా రాజశేఖరా../ సిరివెన్నెల గారి దృష్టిలో, ప్రతి వ్యక్తీ తన పాటలోని కథానాయకుడే! అందుకే ఆయన సందేశం సార్వజనీనం! ఆ రాజశేఖరుడు.. నువ్వు నేను ఎవరైనా అవ్వచ్చు! మనల్ని మనం జయించడమే నిజమైన గెలుపు.
చరణం: అందరూ ఆశగా నిన్ను చూస్తుండగా అనుక్షణం నీడగా వెంట వస్తుండగా మొదటి అడుగై నువ్వే గడప దాటాలిగా నమ్మకం బాటగా నడిచి తీరాలిగా అందరూ ఆశగా నిన్ను చూస్తుండగా అనుక్షణం నీడగా వెంట వస్తుండగా
ఒక మంచి నాయకుడు అధికారంలోకి వస్తే, తమ తలరాతలు మారుతాయని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని.. తరతరాలుగా బలహీనులు, అణగారిన వర్గాల ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా సరైన దిశా నిర్దేశం కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల అంటారు..
/అందరూ ఆశగా నిన్ను చూస్తుండగా అనుక్షణం నీడగా వెంట వస్తుండగా మొదటి అడుగై నువ్వే గడప దాటాలిగా/
చెరగని చిరునవ్వుతో ప్రతి వారిని పలకరిస్తూ, పేరు పెట్టి పలకరించి, ప్రతి వారి భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు అడుగుతూ ఎంతో మంది ప్రజలకు చేరువయ్యారు వైయస్సార్. ఆ నాయకుడు తమకు అండ అనీ, కొండంత బలం అవుతాడన్న నమ్మకంతో కోట్ల మంది ప్రజలు ఆయన వెంట నడిచారు. ఎంతో ప్రజాబలాన్ని కూడగట్టుకున్న నాయకులలో ఆయన కూడా ఒకరు.
ఈ నాయకుడు ఏదో చేస్తాడు అన్న ఆశతో, ప్రజలు నీ వెన్నంటి వస్తుండగా, ధైర్యం చేసి కొత్త బాటలోకి ముందడుగు వేయాలి కదా? ఇక్కడ ‘గడప దాటాలిగా’, అన్న పదబంధం చాలా లోతుగా ఆలోచించవలసినది. గడప అంటే ఇంటి గడప కాదు. మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మన mindset లతో మనం కట్టుకున్న అడ్డుగోడలు. మనం గీసుకున్న పరిధిలో, మనమే ఇరుక్కుపోకుండా, కుంచించుకుపోకుండా.. ఆ boundaries అన్నింటినీ చెరిపేసి, విశాల దృక్పథంతో, కొత్త కలలతో, కొత్త ఆకాంక్షలతో, కొత్త సుప్రభాతానికి నాంది పలకాలి. అలాంటప్పుడు ఏ బాటలో నడవాలో సిరివెన్నెల మనకు సూచిస్తూ../ నమ్మకం బాటగా నడిచి తీరాలిగా/ అంటారు.
ఇందులో సందేహాలకి తావే లేదని, అలా దృఢ సంకల్పంతో ముందుకు సాగి తీరాలనేది పాట/పాఠ్య సారాంశం.
యథా ప్రకారం, సినిమా ఫ్రేమ్‌లో నుండి బయటికి వచ్చి, ఈ పాటను విశ్లేషించుకుంటే, ప్రతి వారి జీవితంలో మలుపు, మలుపులో తీసుకునే గెలుపు నిర్ణయాలను ఈ సాహిత్యం మనకు అందిస్తుంది. బాధ్యత అనే ముళ్ళ కిరీటాన్ని మోస్తున్న ప్రతివారు గ్రహించవలసిన తాత్వికచింతనను ఈ పాట మనకు అందిస్తుంది.
ప్రశ్నల చీకటిలో నుండి బయటపడి, సుసంకల్పం తీసుకుని సువర్ణ సుప్రభాతానికి నాంది పలకమని సిరివెన్నెల మనకు హితవు పలుకుతున్నారు. ఈ సందేశాన్ని ఆచరణలో పెట్టడమే మన వంతు!
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.
మీ ఒక్కొక్క విశ్లేషణా ఓ విశ్వ విద్యాలయం సమానం! ఎన్నో references and quotes are found here! మఱెంతో పరిశోధనా, లోతైన అవగాహనల కలబోత! ఓ పూవు లోని మకరందానికి కావలసిన మూలాలన్నీ ఇౘ్చోటనే లభ్యం! “The Road Not taken!” My way of travel aligns with this and I keep saying it to many. Thank You for giving us a wonderful message song! కృష్ణార్జునులు మనలోనే ఉన్నారన్న గురువు గారి వాక్కు తగిన సమయంలో అందించారు.
You must be logged in to post a comment.
గొంతు విప్పిన గువ్వ – 11
ఇదే ఆఖరు
ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 12
గోదావరి – పాపికొండలు – భద్రాచల యాత్ర-1
అన్నమయ్య పద శృంగారం-23
జీవన రమణీయం-115
మహాప్రవాహం!-20
కురిసి చిత్తడైన అర్థాలలో
పడమటి కడలి -1
నీలిగుచ్ఛం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®