సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    vkonda

    క్రికెట్ మాచ్లో బాట్స్మన్ శతకం సాధించాలంటే ప్రతి పరుగు కోసం రెండు క్రీజ్ ల మధ్య పరిగెత్తాల్సిన అవసరం లేదు. కొన్ని పరుగులైనా with one swing of the bat తో ఫోర్/సిక్స్ లతో శ్రమ పడకుండా ఖాతాలో జమచేసుకోవచ్చు.
    కానీ నూరు వారాలుగా నిరాఘాటంగా “సిరివెన్నెల పాట నామాట” విన్నూత్న శీర్షికన శ్రీమతి శ్రీవాణి శర్మ గారు చెమటోడ్చి ప్రతి వారం వారం అలుపెరగకుండా ప్రతి పరుగు కోసం సృజనాత్మకతతో విశ్లేషిస్తూ సునాయాసంగా పరిగెట్టి (సమీక్షించి) శతకం సాధించి విజయ గర్వంతో హెల్మెట్ తీసి వందనం చేసేలోగానే (పైనుంచి సిరివెన్నెలగారితో పాటు) మనమంతా నిలబడి చప్పట్లు కొట్టాల్సిన అపురూపమైన సమయమిది!
    తెలుగు మాతృభాషైన ఆవిడ వృత్తి పరంగా ఆంగ్ల అధ్యాపకురాలవడం వల్లనేమో అనేక ఆంగ్ల కవుల సాహిత్యం తో ప్రతి వ్యాసంలో సిరివెన్నెలగారి తెలుగు పాటలకున్న పోలికలతో Comparative Work పుష్కలంగా చేసిన ఆవిడకి ఆవిడే సాటి అవడం మనందరి అదృష్టం!
    ఈ సందర్భంగా శ్రీవాణి శర్మగారితో పాటు వారి వెనుకవుండి అవిడమానాన ఆవిడ్ని వదిలేసి సహకరించిన కుటుంబ సభ్యులకి కూడా శుభాభినందనలు! ఈ శీర్షికను ప్రోత్సహించి ప్రచురించిన “సంచిక” డిజిటల్ వెబ్ మ్యాగజీన్ సంపాదకులకు సాంకేతిక వర్గానికి ధన్యవాదములు!

    సిరివెన్నెల అన్నయ్య
    తమ్ముడు వెంకట్ కొండా

  2. 2

    Durga

    తల్లే‌ తొలి గురువు మనవ జాతికి! ఆ తల్లీ, గురువూ పాత్రలను తండ్రి వలే దైవం కాౘుకోవటానికి ఎన్నుకున్న మార్గం, స్వామి వివేకానంద వంటి వారినీ యిలకు పంపి, మనకు దిశా నిర్దేశం చేయమనటం. ఆ స్వామి ఈ కార్యాన్ని తన విలువైన ఏక వాక్య, కొండొకౘో ఉపన్యాస, ఉదాహరణలతో మన చెంతకు చేర్చారు.
    ఆ కోవకే‌ చెందుతారు సిరా వెన్నెల గీతా బోధ శాస్త్రి గురువు గారు.

    అవును, వారి పలుకులు గీతా బోధలే, ఎందుకంటే, ఇన్ని పాటల సారమూ – వారే ఉటంకించినట్లు, ఒక్కటే ఆత్మ కలవి, అవి నశింౘవు ఆత్మ వలె. అందుకే గీతా బోధ అంటాను!

    అటువంటి గీతను, ప్రజలకు చేరువయ్యే మార్గం ద్వారా చెప్ప బూనారే కానీ ఏదో ఒక్క దారేనని గిరి గీసుకు కూర్చోలేదు. ఆ గిరి మనకీ గీయలేదు.

    ఎదగమన్నారు, అధర్మమెదురైతే ఎదిరింౘ మన్నారు, అందరినీ కలుపుకు పోతూ, లోపాలను క్షమిస్తూ, భయాన్నీ, క్రోధాన్నీ, పక్షపాత, అహంకారాలనీ వీడి, మనను సృజించిన ప్రకృతి మాతను పూజిస్తూ సాగమని మన గమనానికి బాట వేశారు.

    అటువంటి అక్షర శిల్పి గుఱించి వ్రాయటమంటే మాటలా! అదీ, వివిధ అంశాలనూ, వాటి references నూ సందర్భానుసారం చొప్పిస్తూ, వాటికి సంబంధించిన విషయాలను సేకరిస్తూ, క్రోడీకరిస్తూ, మాలలుగా అల్లుతూ, వారికి సంబంధించిన అన్ని ప్రక్రియలనూ అందుకుంటూ, వాక్స్వరూపిణి వాగ్దేవి నా వంటి బాలురకు ధైర్యం నూరి పోయటానికి తన వాక్కునే తండ్రి రూపంగా ప్రతి మదిలో నిలిపిన ఆ అమరుని శైలి లోనే మరిన్ని భాషలలోని రచనలనూ సమన్వయం చేసుకుంటూ, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా శత సంఖ్వెయలో వెలువరించిన వ్యాసాలూ, ఆయా పాటల చిత్రాల వివరాలతో సహా! ఏ స్వార్థమూ లేకుండా మా వంటి వారిని కూడా భాగస్వాములను చేస్తూ, కొండొకౘో మేము కొన్ని వేదికల మీద ఓ మాటగా స్పృశించిన అంశాలను వివరణలతో పొందు పరుస్తూ, ఇంత కార్యం దిగ్విజయంగా, అద్వితీయంగా నిర్వహించారు అంటే, అది ఈ శ్రీ మాత ధృడ చిత్తము, సంకల్ప బలమూ, ఆ బలాన్ని అందించిన నిష్కల్మషమైన, నిర్మలమైన మనస్సు, ప్రతిభా, గురువు గారి పై భక్తీ‌ వీటికి తోడు, ఈ తేజస్సునంతటినీ దివ్యశక్తియై నడిపించిన గురువు గారి ఆశీర్వాదమూ కారణం.

    అటువంటి నిపుణురాలూ, రచయిత్రీ గుఱించి పైన వెంకట్ గారు వంటి వారు అందరూ పేర్కొన్నవన్నీ
    ప్రతి అక్షరమూ అమృత తుల్యము.
    మొదట – ఇందుకోసం ఆవిడ శ్రమ పడుతుంటే సహకరించిన వారి కుటుంబానికీ, మా కోసం ఈ రచనలను వెలువరించిన సంచిక వర్గానికి, పెద్దలు, శ్రీ వెంకట్ గారి బాటలో, కృతజ్ఞతలనంద చేస్తూ, క్రింది వాక్యాలతో ముగిస్తున్నాను.

    నిౙంగానే ఆ comparative work, references, searching, efforts are countless. It needs not just commitment but full-length dedication.

    తానుగా అందులో లీనమైన ఈ శ్రీ మాత సార్థక నామధేయ! వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు.

    స్వస్తి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!