Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిందూర తిలకం

[శ్రీ కొండూరి కాశీవిశ్వేశ్వర రావు రచించిన ‘సిందూర తిలకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎంత కాలం! ఎంత కాలం! ఎంత కాలం!
ఎంత కాలం ఈ ఉగ్రవాదం?
ఎంత కాలం ఈ తీవ్రవాదం?
ఎంత కాలం ఈ చావు బ్రతుకులు?

ధర్మమంటూ న్యాయముంటూ
బానిసల్లా బ్రతకవద్దు
ఉగ్రమూకలను మట్టుబెట్టి
చేపట్టరా మన త్రివర్ణ పతాకమును

జన్మనిచ్చిన భరత భూమికి
దేశ ద్రోహము చేయవద్దు
డబ్బు కోసం డాబు కోసం
అమ్మ వంటి హిందూమతమును
మార్చుకుంటే అష్ట దరిద్రమే

హద్దులున్నవి పద్దులున్నవి
ఎవరి సరిహద్దులు వారికున్నవి
హద్దు మీరితే రుద్రమేరా
అస్త్ర శస్త్రముల యుద్ధమేరా

తెలుసుకుంటే బ్రతికిపోతావ్
వినకపోతే నేలకొరిగిపోతావ్
వేదభూమికి వందనం
భరతమాతకు కాశ్మీర సిందూర తిలకం

మన అమర వీరులకు వందనం
మన వీర జవానులకు వందనం

Exit mobile version