సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొండూరి కాశీ విశ్వేశ్వరరావు గారి వ్యాఖ్య: *చరిత్రలో పరిపాలించిన ముస్లిం రాజులలో జైనులాబిదీన్ నిజమైన మతసహనం కలిగిన వాడని తెలుసుకున్నాము. అలాగే సురేశ్వర మందిరమును కాశీ దేవాలయముతో పోల్చడం ఒక విశేషం. యోగిచక్రం గురించి వివరించటం మెుదలగు ఆసక్తికర విషయములు అందించినందుకు కృతజ్ఞతలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🙏🏽*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వారణాసి దేవాలయాలపై జరిగిన అనేక దాడులు.. అన్ని సార్లూ అవి పునరుద్ధరింపబడిన వివరాలు.. మన సాంస్కృతిక ఔన్నాత్యానికి సూచికలుగా నిలిచాయి. జైనులాబీదీన్ ఇస్లాం, హిందూ ధర్మాల సమైక్యత కోసం, ఇరువురి ఆర్థిక స్థితిగతుల ఉద్ధరణ కోసం, వారి సుఖశాంతుల కోసం.. ఎన్నోప్రయత్నాలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాక ఒక ప్రభువుగా.. ఇది ఒక కర్తవ్యంగా భావించారు.. అది వారి విశాల దృష్టికి నిదర్శనం.. తెలేటి తోటల ద్వారా పంటల సమృద్ధికి ఊతమిచ్చి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్డారు.. ప్రజల బాగు కోసం ఇంతగా శ్రమించి అందర్నీ బిడ్డలుగా భావించిన ఒక గొప్ప పాలకుని చరిత్రని.. ఎదుర్కొన్న సమస్యల తీరుతెన్నులని తెలుసుకునే అవకాశం మీ రచన ద్వారా కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ.. అభినందనలతో..💐💐.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి మధుపత్ర శైలజ గారి వ్యాఖ్య: *ఈ వారం రాజతరంగిణిలో పరమతసహనం ఎంతో బాగుంది. కాశీతో సమానం ప్రాధాన్యత సంతరించుకున్న దేవాలయం గురించి చాలా బాగా రాశారు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: * శ్రీవర తృతీయ రాజ తరంగిణి ఇప్పుడే పూర్తిగా ఆస్వాదించాను. జైనులాబిదీన్ చరిత్ర చదువుతుంటే కొత్త చరిత్ర తెలుసుకున్నట్లుగా ఉన్నది.
    వారణాసి క్షేత్ర ప్రభావం, వారణాసిలో జరిగిన మందిరాలను ధ్వంసం చేసిన తిరిగి భారతీయులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం ముదావహం.
    1194 లో 1000 మందిరాలను ధ్వంసం చేయటం దురదృష్టకరం.
    ఇస్లామీయుల కోసం చేసిన ఏర్పాటు ఎంతో గొప్పవి. ఆ ఆ ప్రాంతం పురాణ స్థలం కావడానికి జైనులా బిదీన్ తీసుకొని నిర్ణయం చాలా గొప్పది.
    కాశ్మీర్లో పడవల్లాగా తేలే ద్వీపాలపై డేంబ్ ల మీద రకరకాల పంటలు పండించడం, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం చూస్తుంటే మరో సుందర లోకాన్ని చుట్టి వచ్చినట్టుగా ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు వ్రాశారు.
    శ్రీవర రాజతరంగిణి గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవడం, తెలుసుకోవాలి అనుకోవడం సముచితము.
    ఒక మంచి చరిత్రను తెలియజేసినందుకు ధన్యవాదములు. తాటికోల పద్మావతి*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొత్తపల్లి ఉదయబాబు గారి స్పందన: *వినూత్నంగా విశిష్ట రచనలు చేసే ప్రత్యేకత కలిగిన మీ రచనలన్నీ చాలా లోతుగా అనేక అంశాలను విశ్లేషిస్తూ.. వివరణ ఇస్తూ సాగుతాయి. వాటిల్లో మీ శ్రీవర తృతీయ రాజతరంగిణి ఒకటి.. చాలా తక్కువ భాగం మాత్రమే అర్ధం చేసుకోగలిగాను. అయినా వీలు దొరికినప్పుడు చదువుతున్నాను. తమ నిరంతర కృషికి నా సాహితీ ప్రణామములు 🌹🙏🌹*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!