సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి లో శ్లోకాలు వివరించిన తీరు బాగుంది… కార్యకారణ సంబంధం గురించి భగవద్గీతలో కూడా వస్తుంది.

    Reply
  2. 2

    ములుగు లక్ష్మీ మైథిలి

    రాజతరంగిణి ధార వాహిక చాలా బాగుంది సార్ అభినందనలు 👏👏💐💐🙏🙏

    Reply
  3. 3

    Srinivasa Prasad Thadepalli Ramamoorthy

    చారిత్రక నవలలను రాయడం అంటే కత్తి మీద సాము చేసినట్టే అని చాలామంది విజ్ఞుల అభిప్రాయం. కాల్పనిక నవలా సాహిత్యానికి, చారిత్రక నవలలను ఆయా కాలానికి సంబంధించిన ఋజువులతో రాయడానికి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో శ్రీ ప్రసాద్, ముదిగొండ శివప్రసాద్ వంటి రచయితలు చారిత్రక నవలలు విశ్లేషణాత్మకంగా, పాఠకులను ఆకట్టుకునే విధంగా రాశారు. వారి తర్వాత చారిత్రక నవలా రచన విధానాన్ని ఎన్నుకున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు తన రచనలకు వందకు వంద శాతం న్యాయం చేకూర్చారనే చెప్పవచ్చు. ఉదాహరణకు ఇదే సంచికలోని

    సవిభ్రమా ధృతావర్తా వాహిన్యుత్తా సహేపితాః
    జవాదదావనుత్తుంగా స్తతరంగ తురంగమాః

    అన్న శ్లోకంలో “వాహిని” అన్న పదానికి మహాభారతంలోని “అక్షౌహిని” లోని సైన్యానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ సాగించిన రచనా విధానం అద్భుతం. ఇది ఆయన రచనా వైదుష్యానికి కేవలం ఒక మచ్చు తునక మాత్రమే..

    ఇక్కడ కస్తూరి మురళీకృష్ణ గారి గురించి కొన్ని వాక్యాలు చెప్పడం అవసరంగా భావిస్తున్నాను. తెలుగు భాషతో పాటు హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషలపై మంచి పట్టుగల సాహితీవేత్త, విమర్శకుడు, కవి మన శ్రీ మురళి కృష్ణ గారు.

    చారిత్రిక నవలలతో పాటు సైన్స్ ఫిక్షన్ కథలను, అబ్సర్డ్ (అభూత కల్పన) కథల వంటి ప్రయోగత్మకమైన సాహితీ ప్రక్రియలు విజయవంతంగా చేపట్టిన మన కస్తూరి మురళీకృష్ణ గారికి తగినంత గుర్తింపు రాలేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

    సుప్రసిద్ధ గాయనీమణి లతా మంగేష్కర్ గారి జీవిత చరిత్ర గురించి కూడా మురళి కృష్ణ గారు రాసిన వ్యాసాలు సంచిక పత్రికలో చాలామంది పాఠకులు చదివే ఉంటారు. ఒక నవల/ కథ లేదా వ్యాసం రాసినప్పుడు అందులో పాఠకులను ఆకట్టుకునే విధంగా రాయడంతో పాటు కొత్త విశేషాలను తెలియజేయడం మురళీకృష్ణ గారి ప్రత్యేకత. సాధారణంగా ఈ కళ చాలా మంది రచయితలకు కష్ట సాధ్యమని భావిస్తున్నాను. అటువంటి కష్టసాధ్యమైన ప్రక్రియను ఎంతో సునాయాసంగా కొనసాగిస్తున్న మురళీకృష్ణ గారికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!