[శ్రీ రవి కావూరు రచించిన ‘శిలవు నీవే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
శిలవు నీవే
ఉలివి నీవే
జీవితాన్ని
మలచుకో
నీవు
ఎవరో
చెక్కిన
శిల్పం కాదు
మైనం
పోసిన
బొమ్మవు
కానే కావు
అపనమ్మకం
భయం
నిరాశ
తొందరపాటు
రారాదు
నీ వెంట
దీక్ష, కర్తవ్యాలే..
కదలాలి నీ వెంట
సద్గురువులు
సన్మిత్రులు
కష్టే ఫలి
అదృష్టం..
తోడొస్తే
కాగలవు
నీవొక
ఎల్లోరా
శిల్పం
శిలవు నీవే
ఉలివి నీవే
జీవితాన్ని
మలచుకో
అందంగా మలచుకో
అందంగా మలచుకో..