అక్కడ విలయం తాండవించే మబ్బులు మెరిసిన ఆకాశంలో అగ్ని కీలలు మిస్సల్లై ఎగిరే మనుషులు విగత జీవులై మిగిలే సమాధుల అగ్నిలో అవయవాలు పిడికిలి తెరిచిన మృత్యువాతలు
జీవం లేని మనుషులు చేసే యుద్ధంలో రాజ్యకాంక్ష పెట్రేగింది అగ్రరాజ్యం విసిరింది చిన్నదేశంపై ఉగ్రదాడిలో క్షిపణి అస్త్రాలు వేసే వెర్రితలలు వేసి తలకెక్కిన స్వార్థం ప్రపంచానికి పెను సవాలైంది శాంతి స్థాపన దిశలో
రక్తపుటేరులైన జనావాసాలన్నీ ఆర్తనాదాలూ ఆవేదనలన్నీ మరూభూమిలో పసిగొంతుల రోదనే అమానవీయ రాక్షస విన్యాసాల పెచ్చరిల్లింది యుధ్ధం వికృతంగా
అమానుష విషాద గీతంలో తెగిన విశ్వ వీణ తీగలు ప్రశాంత హృదయ స్పందనల నిండిన సంగీత రాగాలలో వినిపించాలి శాంతి సందేశాలు యుధ్ధంచేసే కనరు మాటల ధిక్కారం స్వరం నెనరుగా స్వరాలన్నీ శాంతి దీపం వెలిగించాలి
అశాంతి అభద్రత బెదిరింపుల భయానక రక్తదాహంలో చెదిరిన మనసులన్నీ ఏకమై యుధ్ధం చేయాలి శాంతి స్థాపనకై
మనిషిని ప్రేమించే మనిషి మళ్ళీ పుట్టాలి క్రాంతి మార్గదర్శిగా మబ్బుల విషాదం మాసిపోయి కాంతి కురిసిన శాంతి వర్షం రావాలి
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తాళం చెవి
అతడి భాషకు తర్జుమా కనుగొనాలి
నవల – కథాగమనం, పాత్రల చిత్రీకరణ – సంవాదం
సంస్మరణ
చిరుజల్లు-66
సినిమా క్విజ్-102
రంగుల హేల 35: బ్రతుకు బొట్టు
నిష్కామ కర్మ
విలువైన వ్యాసాల ప్రతిభా వైజయంతి (యల్లపు ముకుంద రామారావు సమ్మానోత్సవ విశేష సంచిక)
కూతురంటే కూతురే మరి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®