[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘శాఖామృగాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అడవులన్ని
అంతరించినవి
అంతస్తులుగా
అవతరించినవి
మర్కటాలకు
సంకటమైంది
మనుషులతో
పెనుగులాటైంది
స్వేచ్ఛాయుతకు
అడవి ఆటతోట
వాటి జీవనానికి
ప్రకృతి కంచుకోట
దండుకు దండు
జనం మధ్యలో చేరి
భయపెడుతున్నవి
బాధ పెడుతున్నవి
తకపికలాడుతు
చుట్టు తిరుగుతు
భీతిగొల్పి అరుస్తున్నవి
మీదబడి కరుస్తున్నవి
దొడ్డ మనిషి
చెడ్డ బుద్దితోనే
శాఖామృగాలకు
శాపంగా మారింది